వైఎస్. షర్మిల అరెస్టు!

Telugu Lo Computer
0


భారత రాష్ట్ర సమితి శాసన సభ్యుడు బి.శంకర్ నాయక్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు  చేసిన వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్. షర్మిలను ఆదివారం పోలీసులు అరెస్టుచేశారు. ఎలాంటి శాంతిభద్రత సమస్య ఏర్పడకుండా ఉండేందుకు పోలీసులు ఆమెను నైట్ హాల్ట్ క్యాంప్ వద్ద అరెస్టు చేసి హైదరాబాద్‌కు పంపారు. ఆమె శనివారం సాయంత్రం ఓ బహిరంగ సభలో మహబూబాబాద్ ఎంఎల్‌ఏ బి.శంకర్ నాయక్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఆమెపై ఐపిసి సెక్షన్ 504 ఏ, షెడ్యూల్డ్ ట్రైబ్స్ (దౌర్జన్య నిరోధక) చట్టం సెక్షన్ 3(1) కింద కేసులు నమోదుచేశారు. మహబూబాబాద్ ఎంఎల్‌ఏ శంకర్ నాయక్ అవినీతికి, భూఆక్రమణలకు పాల్పడ్డారంటూ షర్మిల  వ్యాఖ్యలు చేశారని తెలిసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)