అండమాన్‌ నికోబార్‌ ద్వీపాలపై నిఘా బెలూన్ ?

Telugu Lo Computer
0


అండమాన్‌ నికోబార్‌ ద్వీపాలపై  బెలూన్‌ అకస్మాత్తుగా ప్రత్యక్షమైందని, మధ్యలో అనేక భారత రాడార్ వ్యవస్థలను తప్పించుకుందని పలువురు అధికారులు చెప్పినట్లు ఓ వార్తాసంస్థ వెల్లడించింది.  ఆ అసాధారణ వస్తువు కనిపించిన ద్వీపాలు భారత్‌ క్షిపణి పరీక్షా కేంద్రాలకు దగ్గరగా ఉన్నాయి. చైనా తదితర దేశాలకు ఇంధనం, ఇతర సామగ్రి జల రవాణాకు కీలకమైన మలక్కా జలసంధీ వాటికి సమీపంలోనే ఉంటుంది. అయితే, ఆ బెలూన్‌ ఎక్కడి నుంచి వచ్చింది? దాని ఉద్దేశం ఏంటి? కూల్చేద్దామా? వద్దా? అనే దానిపై ఒక నిర్ణయానికి రాకముందే  సముద్ర గగనతలంలోకి వెళ్లిపోయినట్లు తెలిపారని పేర్కొంది. వాతావరణ పరిశోధనలకు ఉపయోగించే బెలూన్ కావొచ్చని భావించినట్లు తెలిపింది. అయితే, అమెరికా- చైనా వ్యవహారంతో భారత అధికారులు సైతం గతేడాది జరిగిన వ్యవహారాన్ని తాజాగా పునఃసమీక్షిస్తున్నట్లు సమాచారం. మున్ముందు ఈ తరహా ఘటనలను గుర్తించే సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు, తద్వారా వేగంగా స్పందించేందుకు వీలుగా ఇప్పటికే చర్యలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. అండమాన్ లేదా మరేదైనా ప్రాంతంలో మళ్లీ అలాంటి వస్తువు కనిపిస్తే.. దానిని జాగ్రత్తగా అధ్యయనం చేసి, గూఢచర్య వస్తువుగా తేలితే.. దానిని కూల్చేసే అవకాశం ఉందన్నారు. వాటిని కూల్చేసేందుకు అమెరికా మాదిరి ఖరీదైన సైడ్‌విండర్‌ క్షిపణులు కాకుండా.. యుద్ధ విమానాలు, లేదా భారీ మెషిన్‌ గన్‌లు అమర్చిన రవాణా విమానాల వంటి అవకాశాలను పరిశీలించే ఆస్కారం ఉందని అధికారులు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)