జమ్మూకశ్మీరులో స్వల్ప భూకంపం

Telugu Lo Computer
0


జమ్మూకశ్మీరులో కట్రా ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.6గా నమోదైంది. శుక్రవారం సంభవించిన భూకంపం 10 కిలోమీటర్ల లోతులో సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ ట్వీట్ చేసింది. ఈ భూకంపం వల్ల జమ్మూకశ్మీరులో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని అధికారులు చెప్పారు. కట్రా పట్టణానికి తూర్పున 97 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించడంతో ఇక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)