నెలసరి సెలవులపై ప్రభుత్వాన్నే అడగండి !

Telugu Lo Computer
0


నెలసరి సెలవుల కోసం ఒక విధానాన్ని రూపొందించాలని కేంద్ర శిశు, సంక్షేమ శాఖను కోరాలని పిటిషనర్లకు సుప్రీం కోర్టు సూచించింది. నెలసరి ఒక జీవప్రక్రియ అయినా, ఈ విషయంలో విభిన్నమైన కోణాలు ఉన్నాయని అభిప్రాయపడింది. యజమాన్యాలు మహిళలను ఉద్యోగినులుగా నియమించుకోవడాన్ని ఈ నిర్ణయం నిరుత్సాహపరచవచ్చని తెలిపింది. విద్యార్థినులు, ఉద్యోగినులకు నెలసరి సెలవులు మంజూరు చేయాలని శైలేంద్ర మణి త్రిపాఠి, ఒక న్యాయ విద్యార్థి పిటిషన్‌ వేశారు. సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ పిటిషన్లను విచారించింది. నెలసరి సెలవులపై ప్రభుత్వం విధానం రూపొందించిన తర్వాత దాన్ని తాము పరిగణనలోనికి తీసుకుంటామని బెంచ్‌ తెలిపింది.

Post a Comment

0Comments

Post a Comment (0)