ఫేక్ వార్తలను నమ్మకండి !

Telugu Lo Computer
0


నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం ప్రతినెలా రూ.6 వేల ఆర్థిక సాయం అందజేస్తోందని ప్రచారం నెట్టింట జోరుగా జరుగుతోంది. మరి ఈ ప్రచారం నిజమెంతా..? నిజంగా కేంద్ర ప్రభుత్వం అలాంటి పథకం ప్రవేశపెట్టిందా..? ఈ విషయంపై పీఐబీ క్లారిటీ ఇచ్చింది. వైరల్ అవుతున్న ఈ సందేశం నకిలీదని స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం అటువంటి పథకాన్ని అమలు చేయడం లేదని పీఐబీ వెల్లడించింది. దయచేసి అలాంటి సందేశాలను ఫార్వార్డ్ చేయవద్దని కోరింది. తప్పుడు సమాచారం వైరల్ చేస్తున్నవారిపై చర్యలు తప్పవని హెచ్చరించింది. ఫేక్ ప్రచారం పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అలాంటి మెసేజ్‌లను ఎవరితోనూ షేర్ చేయవద్దని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వానికి సంబంధించిన ఏదైనా పథకం గురించి సమాచారాన్ని పొందాలనుకుంటే.. అధికారిక వెబ్‌సైట్‌లో మాత్రమే సంప్రదించాలని పేర్కొంది. ఇలాంటి నకిలీ వార్తలకు దూరంగా ఉండాలని .. ఈ వార్తలను ఎవరితోనూ పంచుకోవద్దని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. అలాంటి వార్తలను ఫార్వార్డ్ చేయకండని హెచ్చరించింది. మీరు ఏదైనా వైరల్ సందేశం నిజం తెలుసుకోవాలనుకుంటే socialmedia@pib.gov.in కు మెయిల్ చేయవచ్చు.

Post a Comment

0Comments

Post a Comment (0)