విటమిన్ బి12 లోపం - అనర్ధాలు !

Telugu Lo Computer
0


మానవ శరీరానికి విటమిన్ బి12 చాలా ముఖ్యం. రోజుకు 2.4 మైక్రోగ్రాముల విటమిన్ బి12 అవసరం. ఇది ఏమాత్రం తగ్గినా శరీరాన్ని మొత్తం తీవ్రమైన ప్రమాదంలో పడవేస్తుంది. సాధారణ నాడీ వ్యవస్థ పనితీరుకు శరీరానికి అవసరమైన 8 B విటమిన్లలో B12 ఒకటి. విటమిన్ B12 మాంసం, గుడ్లు, పాల ఉత్పత్తుల నుండి మాత్రమే లభిస్తుంది. ఎందుకంటే మొక్కలు దానిని ఉత్పత్తి చేయవు. కొన్నిసార్లు విటమిన్ B12 లోపం లక్షణాలు శరీరంలో కనిపిస్తాయి. విటమిన్ B12 లోపం ఉన్నవారు తమ కాళ్లను వెడల్పుగా ఉంచి నడుస్తారు. ఈ రకమైన నడక ఇతర ఆరోగ్య సమస్యలలో కూడా కనిపిస్తుంది. అయినప్పటికీ విటమిన్ B12 లోపం  నరాలకు హాని కలిగిస్తుంది. ఇది వ్యక్తి కదలికను ప్రభావితం చేస్తుంది. పాదాలు, అవయవాలలో తిమ్మిరి కూడా B12 లోపం వల్ల వస్తుంది. ఇంకా నాలుక వాపు అనేది విటమిన్ B12 లోపం ప్రారంభ సంకేతం. నేరుగా నాలుక పొడవునా పుండ్లు, వాపు కూడా విటమిన్ B12 లోపానికి సంకేతం. దీంతో నాలుక ఎరుపు రంగులోకి మారుతుంది. విపరీతమైన నొప్పితో ఇబ్బందిపడతారు. విటమిన్ B12 లోపం నరాలవ్యాధికి సంబంధించినది. 2018లో నిర్వహించిన ఓ అధ్యయనంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అధ్యయనం మేరకు.. ఇది చదివిన వ్యక్తి జ్ఞాపకశక్తి కోల్పోయినట్లే. నిర్ణయాలు తీసుకునే సత్తా వారికి లేదని అంటున్నారు. ఆలోచనా శక్తి లేకుండా డిప్రెషన్‌కు లోనవుతారని అంటున్నారు. ఎటువంటి స్పష్టమైన కారణం లేకుండా హృదయ స్పందన రేటు వేగంగా పెరగడం శరీరంలో విటమిన్ B12 తగినంతగా లేకపోవడాన్ని సూచిస్తుందని అనేక ఆరోగ్య నివేదికలు చెబుతున్నాయి. శరీరంలో విటమిన్ B12 లోపిస్తే, ఎక్కువ రక్తాన్ని పంప్ చేయడానికి గుండెపై అదనపు ఒత్తిడి పడుతుంది. ఇది జరిగినప్పుడు గుండె కొట్టుకోవటం రేటు కూడా పెరుగుతుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)