తేనీరు - అనారోగ్య సమస్యలు ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 27 February 2023

తేనీరు - అనారోగ్య సమస్యలు !


చాలా మంది టీ లేకుండా తన రోజువారీ జీవితాలను ప్రారంభించడానికి కూడా ఇష్టపడడంలేదు.  టీ వలన కొన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి. టీ తాగడం వలన ఓత్తిడి నుంచి ఉపశమనం లభించడమే కాక నరాలు ఉత్తేజితమవుతాయి. చాలా మందికి టీ తాగిన వెంటనే నీటిని తాగే అలవాటు ఉంటుంది. అయితే ఆ అలవాటు మీ ఆరోగ్యానికి మంచిది కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా చేయడం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందని కూడా చెబుతున్నారు. టీలో కెఫిన్‌ ఉండడం వల్ల చాలా మందికి టీ తాగగానే దాహం వేస్తుంది. ఒక కప్పు టీలో 50 మిల్లీ గ్రాముల కెఫిన్‌ ఉంటుంది. టీ ఎక్కువగా తాగడం వల్ల తరచుగా మూత్రవిసర్జన వస్తుంది. ఇది దాహాన్ని పెంచడమే కాక డీహైడ్రేషన్‌కు గురిచేస్తుంది. టీ తాగిన తర్వాత నీళ్లు తాగితే అసిడిటీ లేదా కడుపునొప్పి వంటి జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దంత సమస్యలు ఉన్నవారికి వేడి వేడిగా ఉండే ఆహార పానీయాలు గానీ.. చల్లగా ఉన్న పానీయాలు గానీ తీసుకుంటే దంతాలపై ప్రభావం పడుతుందని వైద్యులు అంటున్నారు. వేడివిగానీ, చల్లటివిగానీ తీసుకుంటే నోటి ఉష్ణోగ్రతలో ఆకస్మిక మార్పులు సంభవించి పంటి నరాలు దెబ్బతింటాయని, దంతాలలో జలదరింపును కలిగిస్తుంది  టీ తాగిన వెంటనే నీళ్లు తాగడం వల్ల అల్సర్‌ వచ్చే ప్రమాదముందని వైద్యులు చెబుతున్నారు. అయితే కొందరికి టీ తాగగానే కడుపులో గ్యాస్‌ వస్తుంది. దీన్ని తగ్గించడానికి, ఎక్కువ నీరు త్రాగాలి. టీ తాగిన తర్వాత నీళ్లు తాగితే ముక్కు నుంచి రక్తం అయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. మన శరీరం చలి లేదా వేడి రెండింటినీ ఒకేసారి తట్టుకోలేదు. వాతావరణానికి అనుగుణంగా మారడానికి కొంత సమయం పడుతుంది. ఎండాకాలంలో నీళ్లు తాగిన తర్వాత టీ తాగితే ముక్కు ద్వారా రక్తస్రావమవుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వేడి టీ తర్వాత నీటిని తాగడం వల్ల గొంతునొప్పి, దగ్గు, జలుబు వంటి సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ టీ తాగిన వెంటనే నీళ్లు తాగకూడదు. టీ తాగిన అరగంట తర్వాత మాత్రమే నీరు త్రాగాలి. అప్పుడే మీకు ఎలాంటి సమస్యలు దరిచేరవని వైద్యులు సూచిస్తున్నారు.

No comments:

Post a Comment