బీబీసీ కార్యాలయాల్లో కొనసాగుతున్న ఐటీ సోదాలు

Telugu Lo Computer
0


బ్రిటీష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ కార్యాలయాల్లో రెండో రోజైన నేడు కూడా ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. గుజరాత్ రాష్ట్రంలో జరిగిన గోద్రా అల్లర్ల వెనుక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రమేయం ఉందని పేర్కొంటూ ఇటీవల బీబీసీ వివాదాస్పద డాక్యుమెంటరీని ప్రసారం చేసింది. దీన్ని భారత్‌లో ప్రసారంకాకుండా నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో భారత్‌లో ఉన్న బీబీసీ కార్యాలయాలపై ఐటీ అధికారులు మంగళవారం నుంచి సోదాలు చేస్తున్నారు. ఢిల్లీ, ముంబైలలో ఉన్న కార్యాలయాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తన ఉద్యోగులకు బీబీసీ ఈమెయిల్స్ పంపించింది. ఐటీ అధికారులకు ఉద్యోగులు సహకరించాలని, వారు అడిగిన ప్రశ్నలకు సమగ్రంగా సమాధానం ఇవ్వాలని సూచించినట్లు తెలుస్తోంది. జీతం గురించి అడిగిన ప్రశ్నలకు బదులివ్వాలని, వ్యక్తిగత ఆదాయం గురించి స్పందించకుండా ఉండొచ్చని ఆ మెయిల్‌లో పేర్కొన్నట్లు సమాచారం. బ్రాడ్‌కాస్ట్ విభాగం వారు కార్యాలయాలకు రావాలని, మిగిలిన సిబ్బంది ఇంటి నుంచి పనిచేయాలని చెప్పింది. అలాగే ఈ సర్వే గురించి సామాజిక మాధ్యమాల్లో స్పందించ వద్దని ఇదివరకే సిబ్బందికి సంస్థ స్పష్టంచేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)