కేంద్రం చేసిన సూచనను అంగీకరించం !

Telugu Lo Computer
0


మార్కెట్ల నియంత్రణ చర్యలను పటిష్ఠం చేసేందుకు ప్రతిపాదిత నిపుణుల కమిటీ పేర్లు సీల్డ్​ కవర్​లో స్వీకరించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. పెట్టుబడిదారుల ప్రయోజనాల విషయంలో పూర్తి పారదర్శకతను కొనసాగించాలని కోరుతున్నట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సీల్డ్ కవర్‌లో నిపుణుల కమిటీ పేర్లపై కేంద్రం చేసిన సూచనను అంగీకరించబోమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్​ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. తామే కమిటీని ఏర్పాటు చేస్తామన్న ధర్మాసనం, ఈ వ్యవహారంపై దర్యాప్తునకు ఆదేశించాలన్న పిటిషన్లపై తీర్పును వాయిదా వేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)