యువకుడి ప్రాణం తీసిన ప్రియురాలి నగ్న వీడియోలు - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday, 24 February 2023

యువకుడి ప్రాణం తీసిన ప్రియురాలి నగ్న వీడియోలు


ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు మండలం బాలాజీనగర్‌కు చెందిన ఎరుకలి దినేశ్‌ డిగ్రీ చదువుతున్నాడు. తన ఫోన్‌లోంచి ప్రియురాలి నగ్న వీడియోలు సంపాదించి, వాటితో ఆమెను బ్లాక్‌మెయిల్‌ చేసిన స్నేహితుడిని మరో మిత్రుడితో కలిసి కడతేర్చాడు. పోలీసుల కథనం ప్రకారం పూల అలంకరణ పనిచేసే మల్లెపోగు మురళీకృష్ణ (22) ఎరుకలి దినేశ్‌కి స్నేహితుడు. దినేశ్‌ తాను ప్రేమించిన అమ్మాయి నగ్న వీడియోలను తన ఫోన్‌లో ఉంచుకున్నాడు. ఆ వీడియోలను మురళీకృష్ణ తన ఫోన్‌లోకి పంపించుకున్నాడు. అనంతరం ఆ యువతికి ఫోన్‌ చేసి వేధించడం మొదలుపెట్టాడు. వీడియోలను కుటుంబసభ్యులు, బంధువులకు పంపుతానని బెదిరించేవాడు. వేధింపులు తాళలేక యువతి ఇటీవల ఆత్మహత్యకు ప్రయత్నించి ఆసుపత్రిలో చేరింది. దీంతో దినేశ్‌, మురళీకృష్ణపై పగ పెంచుకుని చంపాలని నిర్ణయించుకున్నాడు. హత్యకు ప్రణాళికను కిరణ్‌కుమార్‌ అనే మరో స్నేహితుడితో పంచుకున్నాడు. శివమాల ధరించిన మురళీకృష్ణను జనవరి 25న దినేశ్‌, కిరణ్‌కుమార్‌లు బైక్‌పై ఎక్కించుకుని నగర శివారులోని పంచలింగాల ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ మురళీకృష్ణను కత్తితో పొడిచి చంపారు. ఓ ఆటోను అద్దెకు తీసుకుని మృతదేహాన్ని నన్నూరు టోల్‌ప్లాజా సమీపంలోని హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ కాలువలో పడేశారు. మృతుడి సెల్‌ఫోన్‌, దుస్తులను వేర్వేరు చోట్ల పడేసి వెళ్లిపోయారు. కుమారుడి ఆచూకీ కోసం పలుచోట్ల గాలించిన మురళీకృష్ణ తల్లిదండ్రులు  ఈనెల 16న కర్నూలు తాలుకా అర్బన్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దినేశ్‌ను విచారించగా అసలు విషయం తెలిసింది. మృతదేహం ఆనవాళ్ల కోసం పోలీసులు హంద్రీ-నీవా కాలువలో గాలిస్తున్నారు.

No comments:

Post a Comment