ఆస్ట్రేలియాలో చేపల వర్షం

Telugu Lo Computer
0


ఆస్ట్రేలియాలోని కేథరీన్‌కు నైరుతి దిశలో దాదాపు 560 కిలోమీటర్ల దూరంలో టనామీ ఏడారి ఉంది. ఆ ఏడారి ఉత్తర అంచులో ఉన్న లాజమాను అనే పట్టణంలో భారీ వర్షం కురిసింది. ఆ వర్షంతోపాటే చేపలు భారీ సంఖ్యలో పడ్డాయి. అది చూసి లాజామ పట్టణ ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తొలుత వర్షం మాత్రమే పడుతుందని భావించగా కాసేపట్లోనే భారీ స్థాయిలో ఆకాశం నుంచి చేపలు పడటం మొదలైంది. కాసేపు అలాగే చేపల వర్షం కురిసిందని స్థానికులు చెబుతున్నారు. ఇలాంటి సంఘటనలు గతంలోనూ జరిగాయని లాజమాను పట్టణ ప్రజలు చెబుతున్నారు. 1974, 2004, 2014 లలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు. అయితే, వాతావరణ నిపుణులు మాత్రం వేరే వెర్షన్ చెబుతున్నారు. భారీ సుడిగుండాలు, టోర్నడోలు నీటితో పాటు చేపలను తీసుకెళ్లి వందల కిలోమీటర్ల దూరంలో పడేస్తాయని చెబుతున్నారు. ఈ కారణంగా చేపలు ఆకాశం నుంచి పడతాయని వివరణ ఇస్తున్నారు.


Post a Comment

0Comments

Post a Comment (0)