ప్రభుత్వ ఉద్యోగులు యూట్యూబ్‌ ఛానల్‌ ను నిర్వహించొద్దు !

Telugu Lo Computer
0


కేరళలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు ఎలాంటి యూట్యూబ్‌ ఛానల్‌ను నిర్వహించకూడదని ఆదేశాలు జారీ చేసింది. విధులు నిర్వహించే ఏ ఉద్యోగి కూడా యూట్యూబ్‌ ఛానల్‌ను నడపరాదని స్పష్టం చేసింది. ఒకవేళ ఎవరైనా అలాచేస్తే కేరళ ప్రభుత్వ ఉద్యోగుల నియమావళి 1960 ప్రకారం ఉల్లంఘనే అవుతుందని తేల్చి చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులు ఆర్థికంగా ప్రయోజనం చేకూర్చే విధంగా యుట్యూబ్ ఛానెల్స్, సోషల్ మీడియా ప్లాంట్ ఫాంలలో వీడియోలను పోస్ట్ చేయడాన్ని అనుమతించబోమంది. ఈ మేరకు కార్మిక, నైపుణ్యాల శాఖ డిప్యూటీ సెక్రటరీ ఆర్ఎస్ రూసీ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఉద్యోగుల వ్యక్తిగత స్వేచ్ఛ ఇంటర్నెట్, సోషల్ మీడియాను ఉపయోగించడానికి అనుమతించినప్పటికీ, వారు నిర్ధిష్ట సంఖ్యలో సబ్ స్క్రైబర్లను కలిగి ఉండాలని, యూట్యూబ్ ఛానెల్ నుండి ఆర్థికంగా ప్రయోజనం పొందడానికి అనుమతించబడదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.  ప్రభుత్వ ఉద్యోగులు సోషల్ మీడియాలో గడిపే సమయాన్ని తగ్గించే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం యూట్యూబ్ నడుపుతున్న ప్రభుత్వ ఉధ్యోగులు తమ ఛానెల్స్ ను నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఏ ఒక్కరూ ఇకపై యూట్యూబ్ ఛానల్స్ ను నిర్వహించవద్దని, ఉద్యోగులు అలా చేయడం ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమేనని జీవోలో ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. యూట్యూబ్ చానల్ నిర్వహణకు అనుమతి కోరుతూ అగ్నిమాపక సిబ్బంది చేసిన విజ్ఞప్తి నేపథ్యంలో ప్రభుత్వం ఈ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు, ఇప్పటికే యూట్యూబ్ ఛానళ్లు నిర్వహిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు తమ చానళ్లను మూసివేయాలని ఆ జీవోలో కోరింది.

Post a Comment

0Comments

Post a Comment (0)