సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ అరెస్టు

Telugu Lo Computer
0


హైదరాబాద్ లోని సంధ్య కన్వెన్షన్ ఎండీ సంధ్య శ్రీధర్ ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. 406,407,408,409, 468,120బి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ బంధువును మోసం చేసిన కేసులో ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. రూ.2.5 కోట్లు మోసం చేసిన కేసులో సంధ్య శ్రీధర్ నిందితుడుగా ఉన్నారు. చీటింగ్ కేసులో అరెస్ట్ అయిన సంధ్య శ్రీధర్ ను పోలీసులు ఉప్పర్ పల్లి కోర్టులో హజరు పరిచిన తర్వాత ఢిల్లీకి తరలించనున్నారు. 180 కోట్లు రుపాయలు తాను చెల్లించినట్లు శ్రీధర్ తెలిపారు. న్యాయపోరాటం చేస్తానని చెప్పారు. తన దగ్గర అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయని, కోర్టులో ప్రొడ్యూస్ చేస్తానని చెప్పారు. న్యాయపరంగా పోరాడుతానని అన్నారు. అమితాబచ్చన్ బంధువులను మోసం చేశాననడం అవాస్తవమని తెలిపారు. తాను ఎవరిని మోసం చేయలేదని స్పష్టం చేశారు. ఎస్కార్ట్ కంపెనీ మాజీ వైస్ ప్రెసిడెంట్ అనిల్ నందా ఫిర్యాదుతో సంధ్యా శ్రీధర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఢిల్లీ, లూథియానాలో ఉన్న భూములను సంధ్యా శ్రీధర్ ఫోర్జరీ సంతకాలతో అమ్మారు. సుమారు 200 కోట్ల రూపాయల విలువైన భూములను ఫోర్జరీ డాక్యుమెట్లతో మోసాలకు పాల్పడ్డారని ఫిర్యాదు చేశారు. సంధ్యా శ్రీధర్ రావును మూడు రోజులు ట్రాన్సిట్ వారెంట్ పై కస్టడీకి ఇవ్వాలని ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కోరారు.

Post a Comment

0Comments

Post a Comment (0)