అన్నకు బంగారు నాణేలతో అభిషేకం ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 20 February 2023

అన్నకు బంగారు నాణేలతో అభిషేకం !


సూపర్ స్టార్ రజినీకాంత్ ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సూపర్ స్టార్‏గా ఎంతటి స్టార్ డమ్ వచ్చినా, సింప్లిసిటీకి నిలువెత్తు రూపం రజినీకాంత్. స్టార్ నటుడిగా ఎంత బిజీగా ఉన్నా, వ్యక్తిగత జీవితానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. కుటుంబానికి అత్యంత ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు. భార్య, కూతుళ్లు, మనవళ్లు, బంధువులు, స్నేహితులతో సరదాగా గడుపుతుంటారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోస్ సోషల్ మీడియాలో నిత్యం వైరలవుతుంటాయి. తాజాగా ఆయన తన అన్నయ్య పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తన సోదురుడిపై కనకవర్షం కురిపించారు. ఫిబ్రవరి 19న రజినీకాంత్ సోదరుడు 80 పుట్టినరోజు వేడుకలను బెంగళూరులో ఘనంగా నిర్వహించారు. అదే రోజు తన అన్నయ్య కుమారుడు రామకృష్ణ పుట్టిన రోజు కూడా కావడంతో తనకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. వీరిద్దరి బర్త్ డే వేడుకలకు రజినీకాంత్ తన భార్య లత, కుటుంబసభ్యులతో కలిసి వెళ్లారు. ఈ సందర్భంగా తన అన్నయ్యపై ప్రేమన చాటుకున్నారు. అన్నకు బంగారు నాణేలతో అభిషేకం చేశారు రజినీ. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. అలాగే తన అన్నయ్య గురించి సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. 'నా సోదరుడు సత్యనారాయణరావు గైక్వాడ్ 80వ పుట్టినరోజు. అలాగే ఇదే రోజు తన కుమారుడు రామకృష్ణ 60వ పుట్టినరోజు. ఈ రెండు వేడుకలను ఒకేరోజు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. నన్ను ఈరోజు ఇలా మార్చిన ఈ బంగారు హృదయానికి బంగారు నాణేలతో అబిషేకం చేయడం చాలా సంతోషంగా ఉంది. దేవునికి కృతజ్ఞతలు ' అంటూ ట్వీట్ చేశారు. 

No comments:

Post a Comment