విపత్కర సమయాల్లో ఫిజియోథెరపిస్టులు బాధితులకు ఆశాకిరణాలు !

Telugu Lo Computer
0


అహ్మదాబాద్‌లో జరుగుతున్నఇండియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఫిజియోథెరపిస్ట్‌ జాతీయ సదస్సులో ప్రధాని మోదీ వర్చువల్‌గా పాల్గొని ప్రసంగిస్తూ తుర్కియే - సిరియా భూకంప విపత్తును ప్రస్తావించిన ప్రధాని ''విపత్కర పరిస్థితుల్లో ఫిజియోథెరపిస్టులు బాధితులకు ఆశాకిరణంగా నిలుస్తున్నారు. ప్రమాదాలు, విపత్తుల్లో గాయపడినప్పుడు వారికి కేవలం శారీరక బాధే మాత్రమే కాదు, మానసికంగానూ సవాళ్లు ఎదురవుతాయి. అలాంటి సమయంలో బాధితులకు ఫిజియో వైద్యం అందించి శక్తినివ్వడమేగాక, కొత్త జీవితంపై ఆశను చిగురింపజేయగలరు'' అని మోదీ తెలిపారు. ఇక, ఇలాంటి విపత్తుల తర్వాత అధిక సంఖ్యలో ఫిజియోథెరపిస్టుల అవసరం ఉంటుందని ప్రధాని అన్నారు. బాధితులకు మరింత విస్తృతంగా సేవలు అందించేందుకు వీలుగా ఫిజియో లు 'టెలీ-మెడిసిన్‌' సదుపాయాన్ని వినియోగించుకోవాలని మోదీ ఈ సందర్భంగా సూచించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)