పక్షవాతం రోగులకు ప్రేరణ కలిగించే న్యూరో టెక్నాలజీ - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 22 February 2023

పక్షవాతం రోగులకు ప్రేరణ కలిగించే న్యూరో టెక్నాలజీ


అమెరికా లోని పిట్స్‌బర్గ్ యూనివర్శిటీ లోని కెర్నెజి మిలన్ యూనివర్శిటీ అనే ప్రైవేట్ రీసెర్చి యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు బ్రెయిన్ స్ట్రోక్ రోగులకు కొత్త న్యూరో టెక్నాలజీతో ప్రేరణ కలిగించారు. దీనివల్ల ఆ రోగుల్లోని వెన్నెముక తక్షణం ప్రేరణ చెందడంతో అవయవాలు, చేతుల్లో చలనం కనిపించింది. అదనంగా ఏ సహాయం లేకుండా తమ దైనందిన పనులన్నీ చేయడానికి వారికి వీలు కలిగింది. ఈ న్యూరోటెక్నాలజీలో రెండు లోహపు ఎలెక్ట్రోడ్లు ఉంటాయి. ఇవి ఒక రకమైన నూడిల్స్‌లా ఉంటాయి. మెడ భాగంలో వీటిని అమరుస్తారు. ఇవి స్ట్రోక్ రోగులు తమ పిడికిళ్లను తెరిచి, మూయడానికి , తలపైకి చేతులను లేపడానికి, వస్తువులను పట్టుకోడానికి వీలు కల్పిస్తాయి. ఎవరికైనా బ్రెయిన్ స్ట్రోక్ వస్తే శరీర కదలికలు పరిమితమై పోతాయి. వీరి భవిష్యత్తు చాలా భయంకరమని కార్డియాలజిస్టులు అంచనా వేస్తుంటారు. పరిశోధనల ప్రకారం 25 ఏళ్లు పైబడిన వ్యక్తుల్లో ప్రతి నలుగురిలో ఒకరు స్ట్రోక్‌కు గురవుతున్నారని అంచనాగా తెలుస్తోంది. ఇలాంటి జనాభాలో 75 శాతం మందికి తమ చేతులు కదపలేని పరిస్థితి ఉంటోందని తెలుస్తోంది. స్ట్రోక్ వచ్చిన ఆరు నెలలకు పక్షవాతం శరీరంలో స్థిరమైన దశకు చేరుకుంటుంది. ఈ దశలో డాక్టర్లు ఎలాంటి నిర్దిష్టమైన చికిత్సను కనుగొనలేరు. ఏదేమైనా పరిశోధకులు ఈ తాజా న్యూరోటెక్నాలజీ చికిత్సకు నోచుకోని శరీర బలహీనతలతో సతమతమవుతున్న రోగులకు బలమైన ఆసరా కల్పిస్తుందని పరిశోధకులు నమ్ముతున్నారు. ఈ కొత్త టెక్నాలజీ అత్యధిక స్థాయిలో స్థిరంగా నొప్పితో బాధపడుతున్నవారికి ఇప్పటికే వినియోగిస్తున్నారు. అంతేకాదు .. వెన్నెముకకు గాయం అయిన తరువాత వెన్నెముకను ప్రేరేపింప చేయడం వల్ల కాళ్లల్లో కదలిక ఏర్పడుతోందని అనేక పరిశోధన సంస్థలు నిరూపించ గలిగాయి. స్ట్రోక్ రోగులకు నయం చేయడానికి కొత్త న్యూరోటెక్నాలజీని వినియోగించడంలో శాస్త్రవేత్తలు అనేక సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుంది. మనుషుల చేతుల తాలూకు విశిష్టత, విస్తృతమైన కదలికలు, నాడీ సంకేతాల సంక్లిష్టత వంటివి కొన్ని సవాళ్లుగా ఉన్నాయని చెప్పవచ్చు. పాక్షికంగా చేతుల పక్షవాతంతో ఉండే వానరాల పైన పరీక్షలు , కంప్యూటర్ మోడలింగ్ వంటివి ఉపయోగించి పరిశోధకులు కొన్నేళ్లు ముందస్తు అధ్యయనాలు చేశారు. అయితే మనుషుల్లో సెరైకల్ నాడీ మూలాలు టార్గెట్ చేస్తూ క్లినికల్ ట్రయల్స్ చేపట్టగా బలంతోపాటు కదలికల స్థాయి కూడా పెరిగింది.

No comments:

Post a Comment