అసదుద్దీన్ ఒవైసీ ఢిల్లీ ఇంటిపై రాళ్ల దాడి !

Telugu Lo Computer
0


ఆల్ ఇండియా మజ్లిస్ ఏ ఇత్తేహాదుల్ ముస్లిమీన్ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ  ఇంటిపై రాళ్ల దాడి జరిగింది.ఢిల్లీలోని తన ఇంటిపై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారని, ఈ దాడిలో ఇంటి కిటికీలు దెబ్బతిన్నాయని అసదుద్దీన్ ఒవైసీ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2014 వ సంవత్సరం నుంచి తన ఇంటిపై ఆగంతకులు రాళ్ల దాడి చేస్తున్నారని, ఆదివారం రాత్రి జరిగిన ఈ రాళ్ల దాడి నాల్గవ ఘటన అని అసద్ ట్వీట్ చేశారు. ఆదివారం రాత్రి తాను జైపూర్ నుంచి ఇంటికి 11.30 గంటలకు తిరిగి రాగా రాళ్ల దాడి జరిగినట్లు పనివాళ్లు చెప్పారని, ఈ దాడిలో పలు కిటికీలు పగిలిపోయాయని ఎంపీ అసద్ ట్వీట్ లో పేర్కొన్నారు. ఎంపీ ఫిర్యాదుతో ఢిల్లీలోని అశోకా రోడ్డులో ఉన్న అసద్ ఇంటిని ఢిల్లీ డీసీపీ సందర్శించి రాళ్ల దాడి ఆధారాలు సేకరించారు. తన ఇంటి పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీని సేకరించి రాళ్ల దాడికి పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎంపీ అసద్ డిమాండ్ చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)