నకిలీ డిగ్రీతో అగ్నిమాపక శాఖలో గెజిటెడ్ హోదా !

Telugu Lo Computer
0


మధ్యప్రదేశ్ అగ్నిమాపక శాఖ మాజీ చీఫ్ సూపరింటెండెంట్‌కి ఇండోర్‌లోని స్థానిక కోర్టు నాలుగేళ్ల కఠిన కారాగార శిక్షను విధిస్తూ అదనపు సెషన్స్ జడ్జి సంజయ్ గుప్తా తీర్పు వెల్లడించారు. దీంతోపాటు నకిలీ అధికారి బీఎస్ టోంగర్ (70)కి రూ.12,000 జరిమానా విధించారు. అగ్నిమాపక శాఖ ఇన్‌స్పెక్టర్ ఫిర్యాదు మేరకు టోంగర్‌పై ఆర్థిక నేరాల విభాగం (ఈవోడబ్ల్యూ) పోలీసులు కేసు నమోదు చేశారు. తొలుత ఢిల్లీ ప్రభుత్వ విద్యుత్ సరఫరా యూనిట్ లో లోయర్ డివిజన్ క్లర్క్ గా పనిచేసిన బీఎస్ టోంగర్ మధ్యప్రదేశ్ అగ్నిమాపక విభాగానికి డిప్యూటేషన్ పై వచ్చారు. తన పాత ఉద్యోగ వివరాలను తుడిచిపెట్టిన టోంగర్, నాగ్‌పూర్ లో ఓ కాలేజీలో ఫైర్ ఇంజనీరింగ్ చేసినట్లు నకిలీ డిగ్రీని మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి సమర్పించి ఇండోర్‌లోని అగ్నిమాపక విభాగానికి చీఫ్ సూపరింటెండెంట్‌గా, గెజిటెడ్ అధికారిగా చేరాడు. అయితే 10 తరగతి చదివిన టోంగర్ ఏకంగా ఫేక్ డిగ్రీతో గెజిటెడ్ అధికారి అయ్యారు. నకిలీ పట్టాతో ఏకంగా టోంగర్ దాదాపు 30 ఏళ్లుగా ఆ రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేశాడు. 2013తో పదవీ విరమణ చేశాడు. ఆ ఏడాది అతడిపై ఫేక్ డిగ్రీ ఆరోపణలతో ఛార్జిషీట్ దాఖలైంది. టోంగర్ పై అభియోగాలున రుజువు చేసేందుకు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆశ్లేష్ శర్మ 30 మంది సాక్షులను కోర్టు ముందు హాజరుపరిచారు. నేరం రుజువు కావడంతో కోర్టు శిక్ష విధించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)