క్రెడిట్ కార్డు - ఆదాయపు పన్ను !

Telugu Lo Computer
0


క్రెడిట్ కార్డు ద్వారా ఖర్చు చేస్తూ నెలవారీ జీతం రాగానే బిల్లును తిరిగి చెల్లించే వారు జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎందుకంటే ఆదాయపు పన్ను శాఖ క్రెడిట్ కార్డుల ద్వారా డబ్బు ఖర్చు చేయటంపై కూడా ఓ కన్నేసి ఉంచుతుందని వినియోగదారులు గమనించాలి. ఇలా ఎంత ఖర్చు చేయవచ్చనే దానిపై ఐటీ శాఖ లక్ష్మణ రేఖను గీసింది. ఆ పరిమితులను దాటి ఖర్చు చేస్తే ఐటీ అధికారుల నుంచి కచ్చితంగా నోటీసులు అందుకోవాల్సి ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ డేటా ఈ-కామర్స్ వెబ్‌సైట్లలో క్రెడిట్ కార్డ్ కొనుగోళ్ల సంఖ్య 2022లో 3.7 శాతం పెరిగింది. అంటే దాదాపుగా నాలుగు రెట్లు పెరిగింది. ఇది మాత్రమే కాక POS వద్ద క్రెడిట్ కార్డులను వినియోగించే వారి సంఖ్య కూడా 1.2 శాతం పెరిగింది. అయితే నిర్ణీత మొత్తం కంటే ఎక్కువ ఖర్చయితే ఆదాయపు పన్ను శాఖకు కూడా ఈ విషయాలు తెలుస్తాయి. క్రెడిట్ కార్డ్ కొనుగోళ్లకు సంబంధించి ఆదాయపు పన్ను శాఖ స్పెషల్ నిబంధనలను కలిగి లేనప్పటికీ బ్యాంకులు, ఆర్థిక సంస్థలు అదనపు లావాదేవీలను నివేదించాలి. పన్ను నిబంధనల ప్రకారం బ్యాంకులు ఫారం 61A ద్వారా రూ.10 లక్షల కంటే ఎక్కువ లావాదేవీలను ఆర్థిక సంస్థలు నివేధించాల్సి ఉంటుంది. అలాగే వ్యక్తుల క్రెడిట్ కార్డ్ ఖర్చుల సమాచారాన్ని ఫారం 26A ద్వారా బ్యాంకులకు అందించాలి. ఒక క్రెడిట్ కార్డ్ వినియోగదారుడు ఎంత డబ్బు వెచ్చించవచ్చో కూడా ఆదాయపు పన్ను శాఖ పేర్కొంది. అంతకు మించి డబ్బు ఖర్చు చేస్తే ఆదాయపన్ను శాఖ అతనిపై కన్నేస్తుంది. ప్రతి నెలా రూ. లక్ష కంటే ఎక్కువ క్రెడిట్ కార్డ్ బిల్లులను ర్యాక్ చేసే కస్టమర్లు ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరూ క్రెడిట్ కార్డులను వినియోగించేటప్పుడు తప్పక జాగ్రత్తలు తీసుకోవాలి.

Post a Comment

0Comments

Post a Comment (0)