హడలెత్తించిన క్వాంటాస్‌ విమానం !

Telugu Lo Computer
0


న్యూజిలాండ్‌లోని అక్లాండ్‌ నుంచి సిడ్నీకి బయల్దేరిన క్వాంటాస్‌ విమానం క్యూఎఫ్‌144 పసిఫిక్‌ సముద్రంపై గగనతలంలో ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. ఇది ట్విన్‌ ఇంజిన్‌ బోయింగ్‌ 737-800 మోడల్‌ విమానం. ఈ విమానంలో దాదాపు 100 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. పరిస్థితిని అర్థం చేసుకొన్న ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ 'మేడే' అలర్ట్‌ జారీ చేసింది. సాధారణంగా ప్రాణాంతకమైన పరిస్థితుల్లో వైమానిక రంగంలో ఈ అలర్ట్‌ జారీ చేస్తారు. దాదాపు 45 నిమిషాల ముందు ఈ అలర్ట్‌ జారీ అయ్యింది. దీంతో సిడ్నీ ఎయిర్‌ పోర్టులో ఒక్కసారిగా ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. అంబులెన్స్‌లు, ఫైరింజన్లు, అత్యవసర సిబ్బందిని మోహరించారు. ఇంజిన్‌ సమస్యతోనే ప్రయాణించి, నిర్ణీత సమయానికంటే ముందుగానే సిడ్నీ ఎయిర్‌పోర్టులో సురక్షితంగా ల్యాండ్‌ అయింది. ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగానే ఉన్నట్లు సమాచారం. విమానం గమ్యస్థానానికి చేరుకోవడానికి మరో గంటకు పైగా ప్రయాణం ఉందనగా ఇంజిన్‌లో సమస్య తలెత్తిందని క్వాంటాస్‌ ఓ ప్రకటనలో పేర్కొంది.

Post a Comment

0Comments

Post a Comment (0)