ప్రధాని, యోగికి రక్తంతో లేఖ ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 16 January 2023

ప్రధాని, యోగికి రక్తంతో లేఖ !


ఉత్తరప్రదేశ్‌లోని మథురలోగల బృందావనంలోని బంకీ బిహారీ ఆలయ అభివృద్ధి ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. ప్రతిపాదిత ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ స్థానికులు తమ రక్తంతో రాసిన లేఖను ప్రధాని నరేంద్ర మోడీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు పంపారు. ప్రదిపాదిత అభివృద్ధి ప్రాజెక్టు అవాంఛనీయమని,  ప్రాచీన గృహాలు, జీవనోపాధి ఈ ప్రాజెక్టుతో ధ్వంసమవుతాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలోని పురవాస్తు సంపద అభివ్ధద్ఢి పనులతో నాశనమవుతుందని వారు తమ లేఖలో పేర్కొన్నారు. ప్రతిపాదిత కారిడార్ కోసం 300కు పైగా దుకాణాలు, ఇళ్లు నేలమట్టం కానున్నాయి. ప్రాజెక్టును నిరసిస్తూ ఆలయ పరిసరాలలో ఉన్న 300కు పైగా దుకాణాలను సోమవారం మూసివేసినట్లు బంకీ బిహారీ మార్కెట్ సంఘం అధ్యక్షుడు అమిత్ గౌతమ్ మంగళవారం తెలిపారు. ఆలయ అభివృద్ధి పేరుతో ప్రాచీన కట్టడాల ధ్వంసం జరగనున్నదని, దీన్ని తాము ఎంతమాత్రం అంగీకరించబోమని తెలియచేస్తూ ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి యోగికి తమ రక్తంతో రాసిన లేఖను పంపినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ఆపకపోతే తమ నిరసనలు మరింత ఉధృతం అవుతాయని ఆయన చెప్పారు. కాగా..అలహాబాద్ హైకోర్టు ఆదేశాల మేరకు ప్రాతిపాదిత కారిడార్‌పై 8 మంది సభ్యులతో కూడిన కమిటీ సర్వేను ఈ నెల మొదట్లోనే పూర్తి చేసింది.

No comments:

Post a Comment