స్విగ్గీలో ఉద్యోగుల తొలగింపు ?

Telugu Lo Computer
0


స్విగ్గీ కంపెనీలో పనిచేస్తున్న మొత్తం ఆరు వేల మందిలో దాదాపు 8-10 శాతం ఉద్యోగుల్ని తొలగించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రొడక్ట్, ఇంజినీరింగ్‌తో పాటు ఆపరేషన్ విభాగాల్లో ఈ కోతలు ఉండబోతున్నాయట !. ఇప్పటికే దీనిపై సమీక్ష నిర్వహించిన కంపెనీ ఉద్యోగులకు 0-5 రేటింగ్ కూడా ఇచ్చినట్లు ఓ అధికారి తెలిపారు. ఇందులో 2 నుంచి దానికి తక్కువ రేటింగ్ ఉన్నవారిని వారి పనితీరు మెరుగుపర్చుకునే అవకాశం ఇచ్చారని తెలిసింది. ఆర్థిక మాంద్యం భయాలతో పాటు ఐపీఓకు ముందు కంపెనీని లాభాల్లో ఉంచేందుకు స్విగ్గీ ఉద్యోగాల కోతకు సిద్ధమైనట్లు సమాచారం. మరోవైపు స్విగ్గీ నష్టాలు కూడా రోజురోజుకూ పెరుగుతున్నాయి. 2021లో రూ.1,617 కోట్లుగా ఉన్న నష్టాలు 2022 ఆర్థిక సంవత్సరంలో రూ.3,628.90 కోట్లకు చేరాయి. స్విగ్గీ తన మార్కెట్‌ వాటాను జొమాటోకు కోల్పోతోందని బ్రోకరేజీ సంస్థ జఫ్రీచ్ గతంలో తెలిపిన విషయం విదితమే.

Post a Comment

0Comments

Post a Comment (0)