ఎన్టీఆర్‍కు ఘన నివాళి !

Telugu Lo Computer
0


విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నందమూరి తారక రామారావు 27వ వర్ధంతిని హైదరాబాద్ లో ఆయన కుటుంబసభ్యులు ఘన నివాళులర్పించారు. తెల్లవారుజామునే జూనియర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌లు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌ వద్దకు చేరుకుని నివాళులర్పించారు. తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ నేతలు, కార్యకర్తలు నందమూరి అభిమానులు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించనున్నారు. ఎన్టీఆర్​ ఘాట్ వద్ద​కు చేరుకున్న బాలకృష్ణ తన తండ్రి సమాధి వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులు అర్పించారు. ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ సామాన్య రైతు కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగారని బాలకృష్ణ చెప్పారు. టీడీపీని స్థాపించి ప్రతి తెలుగు బిడ్డకు ఆత్మవిశ్వాసం కల్పించారని గుర్తు చేశారు. ఎన్టీఆర్ తెలుగు తెరను మకుటం లేని మహారాజుగా  ఎలారు. ఏ పాత్రనైనా అలవోకగా చేసి తెలుగు ప్రజల గుండెళ్లో నిలిచారు. ఆయన నటుడిగానే కాకుండా దర్శకుడిగా,నిర్మాతగా, స్టూడియో అధినేతగా,రాజకీయ వేత్తగా, ముఖ్యమంత్రిగా ఎవరికి సాధ్యం కాని రికార్డులను సృష్టించారు. ఆ తర్వాత టీడీపీ పార్టీని స్థాపించి తెలుగు సత్తాను దేశానికి చాటారు. దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. పటేల్, పట్వరీ వ్యవస్థను రద్దు చేసి బడుగు, బలహీన వర్గాలకుక అండగా నిలిచారు.

Post a Comment

0Comments

Post a Comment (0)