భారత్ జోడో యాత్రలో ఊర్మిళ మతోండ్కర్

Telugu Lo Computer
0


భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ వెంట రాజకీయ నాయకురాలిగా మారిన సినీనటి ఊర్మిళ మతోండ్కర్ పాల్గొన్నారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య మంగళవారం ఉదయం 8 గంటలకు ఆర్మీ గార్రిసన్ దగ్గర నుంచి మార్చ్ ప్రారంభమైన కొద్దిసేపటికే ఊర్మిళ మతోండ్కర్ రాహుల్ గాంధీతో చేరారు. రాహుల్ యాత్రకు కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ మద్దతుదారులు ఘన స్వాగతం పలికారు. 2019లో కాంగ్రెస్ చేరిన ఊర్మిళ ఆ పార్టీకి గుడ్ బై చెప్పి 2020లో శివసేన తీర్థం స్వీకరించారు. క్రీమ్-కలర్ సంప్రదాయ కాశ్మీర్ గౌను, బీనీక్యాప్ ధరించి రాహుల్ వెంట నడిచారు. ప్రముఖ రచయిత పెరుమాళ్ మురుగన్, జమ్మూకశ్మీర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు వికార్ రసూల్ వానీ, మాజీ మంత్రి అబ్దుల్ హమీద్ కర్రా కూడా చేతుల్లో త్రివర్ణ పతాకాన్ని పట్టుకుని రాహుల్ వెంట నడిచారు.సెప్టెంబర్ 7న కన్యాకుమారి నుంచి ప్రారంభమైన యాత్ర గురువారం పంజాబ్ నుంచి జమ్మూకశ్మీర్‌లోకి ప్రవేశించింది. మంగళవారం గార్రిసన్ నగరానికి చేరుకుంది. కాశ్మీరీ పండిట్ వలస మహిళల బృందం వారి సంప్రదాయ దుస్తులు ధరించి పూల రేకులతో రాహుల్ గాంధీకి స్వాగతం పలికారు.

Post a Comment

0Comments

Post a Comment (0)