విదేశీయులు ఇళ్లు కొనడంపై నిషేధం !

Telugu Lo Computer
0


కెనడాలో ఉండే విదేశీయులు నివాస స్థలాలు కొనుగోలు చేయకుండా రెండేళ్లపాటు నిషేధం విధించింది. ఈ నిబంధన జనవరి 1, 2023 నుంచి అమల్లోకి వచ్చింది. కెనడాలో స్థానికులకు ఇళ్లు దొరగడంలేదు. దీంతో విదేశీయులు ఇళ్లు కొనకుండా ఉండేందుకు రెండేళ్ల పాటు నిషేధం విధించారు. ఈ నిషేధం కేవలం గృహాలకు మాత్రమే వస్తుందని తెలిపింది. వేసవి కాటేజీల వంటి వినోద ఆస్తులకు ఈ నిషేధం వర్తించదని స్పష్టం చేసింది. 2021 ఎన్నికల ప్రచార సమయంలో ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో ఈ తాత్కాలిక రెండేళ్ల నిషేధాన్ని ప్రతిపాదించారు. కెనడియన్లకు అందుబాటులో లేకుంజా ధరలు పెరిగినప్పుడు ట్రూడో ఈ హామీ ఇచ్చారు. "కెనడాలో రియల్ ఎస్టేట్, గృహాల నిర్మాణం, అమ్మకం సంపన్న సంస్థలు, విదేశీ పెట్టుబడిదారులకు లాభాదాయకంగా ఉంది" అని లిబరల్ పార్టీ ఎన్నికల ప్రచారంలో ప్రస్తావిచింది. కెనడియన్లకు ఇళ్లు దొరకాలంటే తాత్కాలిక నిషేధం విధిస్తామని హామీ ఇచ్చింది. 2021 ఎన్నికల విజయం తర్వాత ఆ పార్టీ నుంచి ప్రధానిగా ఎన్నికైన ట్రూడో విదేశీయులు ఇల్లు కొనడాన్ని నిషేధించారు.


Post a Comment

0Comments

Post a Comment (0)