బిఆర్ఎస్ లో చేరనున్న రావెల

Telugu Lo Computer
0


భారత రాష్ట్ర సమితిలో ఆంధ్రప్రదేశ్ కి చెందిన మాజీమంత్రి రావెల కిషోర్ బాబుతో పాటు రిటైర్డ్ ఐఏఎస్ తోట చంద్రశేఖర్‌లతో పాటు మాజీ ఐఆర్ఎస్ అధికారి పార్థసారధి కూడా నేటి సాయంత్రం తెలంగాణ భవన్ లో కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరనున్నారు. ఈ సందర్భంగా ఎన్టీవీతో మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి, సంక్షేమంలో దూసుకుపోతుందన్నారు. కేసీఆర్ చేస్తున్న కార్యక్రమాలు నన్ను బాగా ఆకర్షించాయని ఆయన వ్యాఖ్యానించారు. ఏపీ పరిస్థితి కుక్కలు చింపిన విస్తరిలా తయారైందని ఆయన విమర్శించారు. ఏపీలో టీడీపీ, వైసీపీ మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోందన్నారు. చరిత్రలో మూడు రాజధానుల నిర్మాణం ఎక్కడా లేదని, ఏపీలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే అద్భుతమైన రాజధాని, సెక్రటేరియట్ నిర్మాణం చేస్తామన్నారు. తోట చంద్రశేఖర్ నేను మంచి స్నేహితులం.. గతంలో ఇద్దరం ఒకే పార్టీలో కలిసి పని చేశాం.. ఇప్పుడు కూడా కలిసే పని చేస్తామని ఆయన వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ చేసినట్లే ఇప్పుడు బీజేపీ కూడా ప్రతిపక్ష పార్టీలను వేధిస్తోందని ఆయన మండిపడ్డారు. సీబీఐ, ఈడీ, ఐటీ పేరుతో రాజకీయ పార్టీలను అణిచివేయలని బీజేపీ చూస్తోందని ఆయన ఆరోపించారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, బీజేపీకి దేశ ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. చివరి శ్వాస వరకు కేసీఆర్ తోనే ఉంటా.. బీఆర్‌ఎస్ లో కొనసాగుతానని ఆయన తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)