విపత్తు ప్రభావిత ప్రాంతంగా జోషిమఠ్ !

Telugu Lo Computer
0


ఉత్తరాఖండ్ లోని జోషీమఠ్‌ ప్రాంతాన్ని విపత్తు ప్రభావిత ప్రాంతంగా ప్రకటించామని కలెక్టర్‌ హిమాన్షూ ఖురాన తెలిపారు. జోషిమఠ్ లో రోజు రోజుకు భూమి కుంగిపోతోంది. 600లకు పైగా భవనాలు, రహదారులకు భారీగా బీటలువారాయి. ఇవి అంతకంతకు పెరుగుతున్నాయి. దీంతో జోషీమఠ్ ను విపత్తు ప్రభావిత ప్రాంతంగా ప్రటించామని తెలిపారు. జోషీమఠ్ , సమీప ప్రాంతాల్లో నిర్మాణ పనులపై నిషేధం విధించామని, విపత్తు ప్రభావిత ప్రజలకు రేషన్‌ కిట్లు అందజేశాం అని ఆయన తెలిపారు. 603 భవనాలకు బీటలువారాయని, 68 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని వారు తలదాచుకొనేందుకు 223 గదులను గుర్తించామని చమోలీ జిల్లా విపత్తు నిర్వహణ అథారిటీ తెలిపింది. ప్రమాదకర పరిస్థితుల్లో ఇంకా ఉంటున్న వారిని తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. జోషిమఠ్ పరిస్థితులపై సీఎం పుష్కర్ సింగ్ ధామి మాట్లాడుతూ ప్రధాని మోడీ ఉత్తరాఖండ్ కు అన్ని విధాలుగా సహాయం అందిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఈ పట్టణానికి నిర్మిస్తున్న బైపాస్‌ పనులను కూడా ఆపేశారు. జోషీమఠ్‌ ప్రజలకు తక్షణ ఉపశమనం కల్పించాలని కోరుతూ స్వామి అవిముక్తేశ్వరానంద సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ ప్రాంతాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని పిటిషన్‌లో కోరారు.

Post a Comment

0Comments

Post a Comment (0)