జమ్మూ కాశ్మీర్‭ లోకి ప్రవేశించిన భారత్ జోడో యాత్ర

Telugu Lo Computer
0


భారత్ జోడో యాత్ర జమ్మూ కాశ్మీర్ ‭లోకి ప్రవేశించింది. గురువారం సాయంత్రం హిమాచల్ ప్రదేశ్ సరిహద్దు లఖ్నాన్‭పూర్ నుంచి జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలోకి అడుగు పెట్టారు రాహుల్ గాంధీ. సరిహద్దులో హిమాచల్ ప్రదేశ్ ‭కు చెందిన కార్యకర్తలు రాహుల్ గాంధీకి వీడ్కోలు చెప్పగా జమ్మూ కశ్మీర్ ‭కు చెందిన కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. లఖ్నాన్‭పూర్ నుంచి రాజధాని శ్రీనగర్ వరకు 10 రోజుల పాటు కొనసాగి జనవరి 30తో యాత్ర ముగుస్తుంది. ముగింపు సభను శ్రీగనర్ ‭లోనే నిర్వహించేందుకు కాంగ్రెస్ పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తోంది. సెప్టెంబర్ 7న తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రారంభమైన ఈ యాత్ర 14 రాష్ట్రాల్లో కొనసాగింది. ప్రస్తుతం జమ్మూ కశ్మీర్ రాష్ట్రం 14వ రాష్ట్రం. ఈ యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ ఇప్పటి వరకు 3,000 కిలోమీటర్లకు పైగానే నడిచారు. వాస్తవానికి రాహుల్ చేపట్టిన ఈ యాత్ర మొదటి దశ యాత్రే అని కాంగ్రెస్ వర్గాలు అంటున్నారు. ప్రస్తుతం దక్షిణం నుంచి ఉత్తరం వరకు యాత్ర సాగగా, మరో యాత్ర పశ్చిమ నుంచి తూర్పుకు సాగుతుందని అంటున్నారు. అయితే రెండవ దశ యాత్ర రాహుల్ గాంధీ కాకుండా ప్రియాంక గాంధీ వాద్రా చేపట్టనున్నట్లు చెబుతున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)