ఫోటోగ్రాఫర్పై జయా బచ్చన్ ఆగ్రహం !

Telugu Lo Computer
0


అమితాబ్ బచ్చన్ తో కలిసి జయా బచ్చన్ బుధవారం ఇండోర్ ఎయిర్ పోర్ట్ కు చేరారు. అక్కడ దంపతులిద్దరికి పూలమాలలు వేసి, బొకేలతో పలువురు స్వాగతం పలికారు. అయితే ఓ ఫోటోగ్రాఫర్ ఆమెను ఫోటో తీసేందుకు ప్రయత్నించాడు. అతనిని వారించినా అతను వినకుండా అలాగే ఫోటోలు తీయడంతో జయాబచ్చన్ అసహనం వ్యక్తం చేశారు. నా ఫోటో తీయొద్దు, నీకు ఇంగ్లీష్ అర్థం కాలేదా? అంటూ ఫోటోగ్రాఫర్ పై ఫైర్ అయ్యారు. ఆ సమయంలో ఆమె వెనుకనే ఉన్న అమితాబ్ బచ్చన్ సైలెంట్ గా ఉన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)