పాకిస్థాన్ అమ్మాయి అరెస్టు! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 23 January 2023

పాకిస్థాన్ అమ్మాయి అరెస్టు!


తన బాయ్‌ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకోడానికి భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించిన 19 ఏళ్ల పాకిస్థాన్ అమ్మాయిని బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. తన ఐడెంటిటీని ఫోర్జ్ చేసుకుని ఆమె బెంగళూరులో నివాసముంటుండగా పోలీసులు పట్టుకున్నారు. ఆమెను ఇర్ఖా జీవానీ అని గుర్తించారు. ఆమె ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ములాయం సింగ్ యాదవ్ (26)ను పెళ్లాడింది. ఆమెకు ఆశ్రయం ఇచ్చిన అతడిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. చెల్లుబాటుకాని దస్తావేజులతో ఓ పాకిస్థానీ అమ్మాయి దేశంలోకి ప్రవేశించి బెంగళూరులో నివసిస్తున్నట్లు కర్నాటక ఇంటెలిజెన్స్ బ్యూరోకు సమాచారం అందడంతో వారిని అరెస్టు చేశారు. జీవానీ కొన్ని నెలల క్రితం గేమింగ్ యాప్ ద్వారా యాదవ్‌కు పరిచయం అయింది. ఆ తర్వాత ఇండియా, నేపాల్ సరిహద్దు గుండా భారత్‌లోకి ప్రవేశించింది. కాగా యాదవ్ గత ఏడేళ్లుగా బెంగళూరులో నివసిస్తున్నాడు. అక్కడే సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్నాడు. లూడో ఆడటంలో ఆసక్తి ఉన్న యాద్‌వ్ ఆమెకు మొబైల్ గేమింగ్ యాప్ ద్వారా పరిచయమయ్యాడు. వారిద్దరూ తర్వాత ప్రేమలో పడ్డారు. అయితే యాదవ్‌కు మొదట ఆమె పాకిస్థాన్‌కు చెందిందని తెలియదట. తర్వాత మాత్రం ఆమె పాకిస్థాన్‌లోని హైదరాబాద్‌కు చెందిందని తెలుసుకున్నాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాక నేపాల్‌లోని ఖాట్మాండుకు రమ్మని ఆహ్వానించాడు. వారి వివాహం ఖాట్మండూలో హిందూ పద్ధతిలో జరిగింది. ఈ ఏడాది సెప్టెంబర్ 28న యాదవ్, జీవానీతో తిరిగి బెంగళూరుకు వచ్చి పని చేయసాగాడు. తర్వాత అతడు ఆమె పేరును రవా యాదవ్‌గా మార్చి ఆధార్ కార్డు కూడా పొందాడు. బెంగళూరులోని సార్జాపూర్‌లో గోవింద రెడ్డి అనే వ్యక్తి ఇంట్లో వారు కిరాయికి ఇల్లు తీసుకుని నివసించారని పోలీసు వర్గాలు తెలిపాయి. బెంగళూరు పోలీసులు విదేశీయుల చట్టం 7(2), ఇండియన్ పినల్ కోడ్(ఐపిసి) 420,465,471 సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు. వారి వివరాలు సేకరించనందుకు రెడ్డిని కూడా బుక్‌చేశారు.

No comments:

Post a Comment