వారణాసిలో టెంట్ సిటీని ప్రారంభించిన ప్రధాని

Telugu Lo Computer
0


యాత్రీకుల సౌకర్యార్ధం వారణాసిలో, గంగానది పక్కన అభివృద్ధి చేసిన టెంట్ సిటీని ప్రధాని మోడీ ప్రారంభించారు. గంగా నది ఒడ్డున టెంట్ నగరాన్ని నిర్మించారు. పర్యాటకులకు విడిది కల్పించడానికి ఈ టెంట్ సిటీని ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేశారు. అంతర్గత జలమార్గాలను మరింత అధునాతనం చేసనదీ ఆధారిత పర్యటకాన్ని అభివృద్ధి చేయాలనేదే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగా టెంట్ సిటీని నిర్మించారు. మినీ టెంట్ సిటీకి వచ్చే సందర్శకులు ఉత్తరప్రదేశ్ స్టేట్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా ఆన్‌లైన్ బుకింగ్ చేయాల్సి ఉంటుంది. విలాసవంతమైన బస ఏర్పాట్లను ఆస్వాదించవచ్చు. ఈ ఏడాది డీలక్స్, సూపర్ డీలక్స్ కేటగిరీల చొప్పున 50 టెంట్లు ఏర్పాటు చేశారు. ఈ విలాసవంతమైన గుడారాలలో బెడ్‌రూమ్, డ్రెస్సింగ్ కమ్-స్టోర్ రూమ్, వాష్‌రూమ్, లాబీ ఉన్నాయి. షీషమ్ చెక్కతో చేసిన ఫర్నిచర్‌తో ఇంటీరియర్ డిజైన్ చేయడం విశేషం. చెక్క ఫ్లోరింగ్‌తో పాటు, ఈ కాటేజీల్లో సౌకర్యవంతమైన బస కోసం వాటర్‌ప్రూఫ్ టెంట్లు కూడా ఉన్నాయి. డీలక్స్ టెంట్ లోపల 400 చదరపు అడుగుల విస్తీర్ణం ఉంటుంది. సందర్శకులు తమ అల్పాహారాన్ని ఆస్వాదించడానికి లేదా యమునాకు సమీపంలో సమయాన్ని గడపడానికి లాబీ ఉంటుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)