మెదడుపై గట్ బ్యాక్టీరియా ప్రభావం !

Telugu Lo Computer
0


మన శరీరంలో నివసించే బ్యాక్టీరియా, సూక్ష్మజీవులు మన మెదడుపై ప్రభావం చూపిస్తాయని శాస్త్రవేత్తలు నిర్ధారిస్తున్నారు. పేగుల్లో వ్యాధులను కలిగించే బ్యాక్టీరియా కూడా ఉంటుంది. దీన్ని గట్ బ్యాక్టీరియా అంటారు. అయితే జీర్ణాశయంలో నివసించే బ్యాక్టీరియా లో ఎక్కువ శాతం మనకు మేలు చేసేవే అని ఇటీవల వరకు వైద్యులు భావించే వారు. మన పోషకాలను సద్వినియోగం చేసుకుంటాయని నమ్మేవారు. కానీ మన ఆరోగ్యంపై వీటి ప్రభావం చాలా ఉంటుంది. వాస్తవానికి మన శరీరంపై పరాన్నజీవులుగా బతికే బ్యాక్టీరియాతో మన శరీరానికి సహజీవన బంధం ఎక్కువ. దీనిదృష్టా అవి కూడా ఆరోగ్యంగా ఉండేలా సమతుల్యత కాపాడుకోవలసిన అవసరం ఉంది. మన ఆహారం లోని పోషకాలు పేగుల నుంచి రక్తం లోకి ప్రవహిస్తుంటాయి. అదే విధంగా పేగుల్లోని బ్యాక్టీరియా ద్వారా తయారైన పదార్ధాలు కూడా రక్తం లోకి ప్రవహిస్తుంటాయి. కొన్ని నరాలు మెదడు, పేగులను కూడా కలుపుతుంటాయి. ఈ ప్రక్రియలో మెదడుపై బ్యాక్టీరియా పర్యావరణ ప్రభావం ఎప్పుడూ ఉంటుంది. ఆ బ్యాక్టీరియా ఆరోగ్యంగా ఉంటేనే మెదడు క్షేమంగా ఉంటుంది. మనిషి శరీరంలో సుమారు 30 ట్రిలియన్ మానవ కణాలున్నాయి. వీటితోపాటు మైక్రోబయోమ్, బ్యాక్టీరియా, వైరస్‌లు , శిలీంధ్రాలు కలిపి మరో 39 ట్రిలియన్ సూక్ష్మజీవుల కణాలు ఉన్నాయి. ఇవి మన శరీర కణాలు కంటే చిన్నవిగా ఉన్నా ఇవి చేసే పని ఎక్కువ. మన పేగుల్లో ఉండే మైక్రోబయోమ్‌లను గట్ మైక్రోబయోమ్‌లు అని కూడా అంటారు. ఇవి కొవ్వు నిల్వను నియంత్రించడమే కాదు, రక్తనాళాలను సృష్టించి మానవ కణాల్లో జన్యువులను చైతన్య పరుస్తాయి. దెబ్బతిన్న లేదా చనిపోతున్న కణాలను కొత్త వాటితో భర్తీ చేస్తాయి. హానికరమైన సూక్ష్మజీవులు మన శరీరంపై దాడి చేసినప్పుడు మన శరీరంలో ఉంటే సూక్ష్మజీవులు వాటితో పోరాటం సాగిస్తాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)