మైనర్‌ తో పారిపోయిన టీచరమ్మ !

Telugu Lo Computer
0


ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలోని సెక్టార్ 123లో నివసిస్తున్న 22 ఏళ్ల టీచర్ ఇంట్లో పిల్లలకు ట్యూషన్ చెబుతుండేది. ఈ క్రమంలో టీచర్ ఇంటి ముందు 16 ఏళ్ల బాలుడు నివసిస్తున్నాడు. మైనర్‌ బాలుడు టీచర్‌ వద్దకు చదువుకునేందుకు ఎప్పుడూ వెళ్తుండేవాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడటం మొదలుపెట్టారు. ఘాటైన ప్రేమలో మునిగితేలుతున్న ఇద్దరూ ఆదివారం ఇంటి నుంచి పారిపోయినట్లు బాలుడి తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారు. బాలుడి తండ్రి స్వస్థలం డియోరియా అని, తన 16 ఏళ్ల కుమారుడు ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో అత్త ఇంటికి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిపోయాడని, సాయంత్రం వరకు తిరిగి రాలేదని బాలుడి తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నాడు. తమ ఇంటి ఎదురుగా నివసిస్తున్న 22 ఏళ్ల యువతి ట్యూషన్ చెబుతుందని, అక్కడికి తమ కొడుకు వెళ్తాడని తండ్రి పోలీసులకు చెప్పాడు. ఆమె తన కొడుకును తీసుకుని వెళ్లిపోయిందని ఫిర్యాదులో వివరించాడు. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు టీచర్‌పై కేసు నమోదు చేశారు. పలు కోణాల్లో ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ విషయమై అడిషనల్ డీసీపీ అశుతోష్ ద్వివేది మాట్లాడుతూ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, యువతి బాలుడిని తీసుకుని వెళ్లినట్లు తెలిసిందని పోలీసులు పేర్కొన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)