హిందూ వృద్ధురాలికి అంత్యక్రియలు చేసిన ముస్లిం యువత !

Telugu Lo Computer
0


మధ్యప్రదేశ్ లోని గ్యాలియర్ పట్టణంలోని రైల్వేకాలనీ దర్గా ప్రాంతంలో రామ్ దేహి మహోర్ (90) అనే వృద్దురాలు నివాసం ఉంటుంది. ఆమెకి ఉన్న ఒక్క కూతురు కూడా పెళ్లి చేసుకుని ఢిల్లీలో ఉంటుంది. ఈ క్రమంలో రామ్ దేహి మహోర్ ఒక్కరే జీవనం సాగిస్తున్నారు. అయితే స్థానికంగా ఉండే ముస్లిం కుటుంబాలకు ఆ వృద్ధురాలు అప్పుడప్పుడు భోజనం పెట్టేది. అలా వారితో ఎంతో అప్యాయతగా ఉండేది ఆ వృద్ధురాలు. అక్కడి ముస్లిం యువత కూడా ఆ వృద్ధురాలిని సొంత తల్లిలాగా భావించే వారు. అలాంటి మంచి మనస్సున ఆ వృద్ధురాలు మరణించింది. ఆమె అంత్యక్రియలు నిర్వహించేందుకు అదే ప్రాంతంలో ఉండే బంధువులు వెనుకడుగు వేశారు. దీంతో ఆ వృద్ధురాలి అంత్యక్రియలు నిర్వహించేందుకు కొందరు ముస్లిం యువత ముందుకు వచ్చారు. ఆమెను అమ్మలా భావించే మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగి షకీర్ ఖాన్, తన సోదరుడు, ఇతర స్నేహితులతో కలిసి హిందూ సంప్రదాయల ప్రకారం ఆమె అంత్యక్రియలకు ఏర్పాటు చేశారు. ఆ వృద్ధురాలి మృతదేహాన్ని భుజాన మోసుకుని శ్మశానవాటికకు తీసుకెళ్లారు. ఇదే సమయంలో రామ్ దేహి కూతురు షీలా గ్యాలియర్ వచ్చింది. తల్లి మృతిని తట్టుకోలేక కన్నీరుమున్నీరుగా విలపించింది. అనంతరం తన తల్లి చితికి నిప్పంటించారు. తమకు అన్నం పెట్టిన ఆ తల్లికి అంత్యక్రియాలు చేసి రుణం తీర్చుకున్నారు ఆ ముస్లిం యువత. మతాల పిచ్చితో కొట్టుకునే కొందరిని చూసి మనిషిలాగా మారాలని స్థానికులు కోరుకున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)