శ్రీలంకకు భారత్ సాయం !

Telugu Lo Computer
0


తీవ్ర ఆర్థిక సంక్షోభంతో దివాళా తీసిన శ్రీలంకను ఆదుకునేందుకు భారత్ తనవంతుగా సాయం చేస్తూనే ఉంది. ఇప్పటికే అనేక రకాలుగా సాయం చేసిన ఇండియా తాజాగా మరోసారి సహాయం చేసింది. శ్రీలంకకు 75 ప్రజా రవాణా బస్సుల్ని అందజేసింది. శ్రీలంకలో రవాణా వ్యవస్థని మెరుగుపర్చే ఉద్దేశంతో వీటిని అందజేసింది. శ్రీలంకలో భారత రాయబారి వీటిని అక్కడి అధికారులకు అందజేశారు. మొత్తం 500 బస్సుల్ని అందజేయాలని భారత్ నిర్ణయించింది. మిగతా బస్సుల్ని కూడా దశలవారీగా అందిస్తారు. గత మేలో తమ దేశం దివాళా తీసినట్లు శ్రీలంక ప్రకటించింది. అప్పటి నుంచి ఇండియా అనేక రకాలుగా శ్రీలంకకు సాయం చేస్తోంది. 'నేబర్‌హుడ్ ఫస్ట్' అనే విధానం కింద శ్రీలంకకు ఇండియా సాయం చేస్తోంది. శ్రీలంక పోలీసులకు గత డిసెంబర్‌లో 125 ఎస్‌యూవీలు అందజేసింది. అక్కడ సరైన వాహనాలు లేకపోవడంతో పోలీసులు పని చేయడం కూడా కష్టమవుతోంది. అందుకే ఇండియా వీటిని అందజేసింది. అంతకుముందు 4 బిలియన్ అమెరికన్ డాలర్ల సాయం ప్రకటించింది. తర్వాత 900 మిలియన్ డాలర్ల రుణం అందజేసింది. శ్రీలంక దగ్గర చమురు కొనేందుకు కూడా డబ్బులు లేవు. దీంతో శ్రీలంక చమురు కొనేందుకు 500 మిలియన్ డాలర్ల సాయం ప్రకటించింది. తర్వాత దీన్ని 700 అమెరికన్ డాలర్లకు పెంచింది. భారత్ అందించిన సాయాన్ని అత్యవసర వస్తువులు, చమురు కొనేందుకు వినియోగించుకుంటోంది శ్రీలంక. ఇప్పుడిప్పుడే శ్రీలంక ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తోంది. వివిధ దేశాలు శ్రీలంకకు ఆర్థిక సాయం అందజేస్తున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)