సురినామ్‌ అధ్యక్షుడు చంద్రికా ప్రసాద్ ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 10 January 2023

సురినామ్‌ అధ్యక్షుడు చంద్రికా ప్రసాద్ !


మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరుగుతున్న 17వ ప్రవాసీ భారతీయ సమ్మేళన్‌లో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక గౌరవ అతిథిగా సురినామ్‌ ప్రెసిడెంట్ చంద్రికాప్రసాద్‌ సంతోఖీ, ముఖ్య అతిథిగా గయనా అధ్యక్షుడు మొహమ్మన్‌ ఇర్ఫాన్‌ అలీ హాజరయ్యారు. 66 దేశాల నుంచి వచ్చిన ఎన్నారైలనుద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించారు. సురినామ్ ప్రెసిడెంట్ చంద్రికా ప్రసాద్ సంతోఖి గత ఏడాది సురినామ్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. విదేశాల్లో ఉంటూ భారతదేశం గర్వించేలా చేస్తున్న భారతీయుడిగా ప్రధాని మోడీ మన్ కీ బాత్‌లో పేర్కొన్నారు. సురినామ్‌లోని లెలీడోర్ప్‌లో ఫిబ్రవరి 3, 1959న జన్మించిన చంద్రికా ప్రసాద్ సంతోఖి పూర్వీకులు బీహార్‌కు చెందినవారు. చంద్రికా ప్రసాద్ తండ్రి బీహార్ లో కూలీగా పనిచేసేవారు. అతను దక్షిణ అమెరికా లోని ఉత్తర భాగాన గల దేశాలలో ఒక చిన్న దేశం సురినామ్‌ చేరుకొని ఓడరేవులో కార్మికుడిగా పనిచేయడం ప్రారంభించాడు. చంద్రికా ప్రసాద్ తల్లి ఒక షాపులో పని చేసేది.ఆయనికి తొమ్మిది మంది సోదరులు, సోదరీమణులు ఉన్నారు. 1978లో సంతోఖి నెదర్లాండ్స్‌లోని అపెల్‌డోర్న్‌లోని నెదర్‌లాండ్స్ పొలిటియా అకాడమీలో ఉన్నత విద్య కోసం స్కాలర్‌షిప్‌ను పొందారు. 1982లో అప్లైడ్ రీసెర్చ్‌లో పట్టభద్రుడలయ్యారు. నెదర్లాండ్స్‌లోని పోలీస్ అకాడమీలో నాలుగేళ్లపాటు శిక్షణ తీసుకున్నారు. 1982లో సురినామ్‌కు తిరిగి వచ్చి పోలీసు శాఖలో పని చేయడం ప్రారంభించారు. 1989లో నేషనల్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్‌గా, రెండేళ్ల అనంతరం 1991లో పోలీస్ డిపార్ట్‌మెంట్ చీఫ్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. 2005లో న్యాయ, పోలీసు శాఖ మంత్రిగా పనిచేసి 2011లో ప్రోగ్రెసివ్ రిఫార్మ్ పార్టీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. చంద్రికా ప్రసాద్ సంతోఖి 19 జూలై 2020న వివాహం చేసుకున్నారు. గత ఏడాది జూలైలో నేషనల్ అసెంబ్లీ మాజీ న్యాయశాఖ మంత్రి, ప్రోగ్రెసివ్ రిఫార్మ్ పార్టీ నాయకుడు సంతోఖిని సురినామ్‌ దేశానికి అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. లాటిన్ అమెరికా దేశమైన సురినామ్ అధ్యక్షులుగా చంద్రికా ప్రసాద్ సంతోఖి ఎన్నికైనప్పుడు చంద్రికా ప్రసాద్ సంస్కృతంలో ప్రమాణం చేశారు. అప్పట్లో అది ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. దాదాపు 6 లక్షల జనాభా ఉన్న సురినామ్‌లో 27.4 శాతం మంది భారతీయులున్నారు. ప్రెసిడెంట్ సంతోఖి పార్టీ భారతీయ సమాజానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. ఒకప్పుడు అక్కడ యునైటెడ్ హిందుస్థానీ పార్టీగా పిలువబడింది. సురినామ్ ఆర్థిక వ్యవస్థ బాక్సైట్, చమురు నిల్వలపై ఆధారపడి ఉంది, అయితే దేశం గత కొంతకాలంగా ఆర్థిక సంక్షోభంతో పోరాడుతోంది. ప్రస్తుతానికి సంతోఖికి ఇదే అతిపెద్ద సవాల్.

No comments:

Post a Comment