మహిళా విద్యకు తాము వ్యతిరేకం కాదు !

Telugu Lo Computer
0


ఆఫ్ఘనిస్తాన్ లో అమ్మాయిలు హైస్కూల్లో కాలేజీలు వర్సిటీలో చదువుకోకుండా విధించిన నిషేధం శాశ్వతం కాదు అంటూ తాలిబన్ ప్రతినిధి ఒకరు ప్రకటన చేయడం హాట్ టాపిక్ గా మారిపోయింది. స్కూలు కాలేజీలు వర్సిటీలో అమ్మాయిలకు అనువైన వాతావరణం కల్పించిన తర్వాత వారు మళ్లీ తిరిగి చదువుకునేందుకు అవకాశం కల్పిస్తాము అంటూ చెప్పుకొచ్చారు. మహిళా విద్యకు తాము ఎప్పుడు వ్యతిరేకం కాదు అంటూ తాలిబన్ ప్రతినిధి చెప్పడం గమనార్హం. తాలిబన్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఒక్కసారిగా ఆఫ్గనిస్తాన్ ప్రజల జీవనశైలి అస్తవ్యస్తంగా మారిపోయింది. తాలిబన్ల ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత మహిళలకు సమచిత గౌరవం కల్పిస్తాము అంటూ కల్లబొల్లి మాటలు చెప్పిన తాలిబన్లు.. ఇక ఆ తర్వాత మాత్రం ఏకంగా మహిళలను వంటింటి కుందేలు గానే మార్చేశారు. చదువులు చదవనివ్వకుండా, ఉద్యోగాలు చేయనీయకుండా, ఏ క్రీడారంగంలో రాణించకుండా నిషేధం విధిస్తూ వచ్చారు. ఎవరైనా మహిళలు తాలిబన్లు తీరును వ్యతిరేకిస్తూ నిరసనలు చేపడితే వారిపట్ల కర్కశంగా వ్యవహరిస్తుండడం కూడా ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిపోయింది.

Post a Comment

0Comments

Post a Comment (0)