వధువును ఎత్తుకొని కిందపడ్డాడు ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 10 January 2023

వధువును ఎత్తుకొని కిందపడ్డాడు !


పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ప్రత్యేకమైనది. ఇటీవల కాలంలో వివాహాలు.. ఎంటర్‌టైన్‌మెంట్‌కు కేరాఫ్‌ అడ్రస్‌గా మారుతున్నాయి. ఆటలు, పాటలు,స్టెప్పులతో చాలా సరాదగా జరుపుకుంటున్నారు. పెళ్లిలో చిన్న చిన్న చిలిపి పనులు, ఫన్నీ మూమెంట్స్‌ లేకుంటే సరదా ఏముంటుంది చెప్పండి. అప్పుడప్పుడు ఈ వేడుకల్లో కొన్ని చిత్ర విచిత్ర ఘటనలు కూడా చోటుచేసుకుంటాయి. ఇక ఇప్పటికే సోషల్‌ మీడియాలో వీటికి సంబంధించిన వీడియోలే ఎక్కువగా దర్శనమిస్తున్నాయి. తాజాగా అలాంటి ఘటనే ఒకటి నెట్టింట్ వైరల్‌గా మారింది. పెళ్లి తర్వాత ఎలాగూ బరువు బాధ్యతలు తప్పవనుకున్నాడో ఏమో గానీ ఓ వరుడు వివాహం అనంతరం భార్యను చేతుల్తో ఎత్తుకొని స్టేజ్‌ నుంచి కిందకు వచ్చాడు. వధువును ఎత్తుకొని వేదిక మెట్లు దిగుతుండగా వరుడు జారి కిందపడిపోయాడు. కానీ వధువును మాత్రం కింద పడిపోకుండా తన చేతుల్లోనే గట్టిగా పట్టుకున్నాడు. అయితే కిందపడినప్పటికీ పెళ్లి కొడుకు ఏమాత్రం అవమానకరంగా, ఇబ్బందిగా ఫీల్‌ అవ్వలేదు. వెంటనే అతను లేచి నిలబడి నవ్వుతూ భార్యను ముద్దుపెట్టుకొని ఆమెను ఓదార్చాడు. అంతేగాక ఏం పర్వాలేదు, ఇలాంటి జరుగుతుంటాయి అంటూ ఆమెలో ఉత్సాహాన్ని నింపాడు. జోయా జాన్‌ అనే అనే యూజర్‌ దీనిని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేయడంతో వైరల్‌గా మారింది. 

No comments:

Post a Comment