రాహుల్‌కు సైనిక కమాండో సెల్యూట్ !

Telugu Lo Computer
0


సైనిక యూనిఫారమ్, పతకాలు ధరించి ఒక మాజీ సైనికుడు పంజాబ్‌లో సాగుతున్న భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సెల్యూట్ చేస్తున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దీనిపై వివాదం రాజకుంది. దీనిపై కొందరు నెటిజన్లు విమర్శలు గుప్పించారు. ది గ్రెనేడియర్స్ రెజిమెంట్‌కు చెందినట్లుగా సూచిస్తున్న బ్యాడ్జి, పూర్తిస్థాయి పతకాలు ధరించి, భుజానికి కమాండో అని రాసి ఉన్న బ్యాడ్జితో ఉన్న ఒక వ్యక్తి రాహుల్ గాంధీకి సెల్యూట్ చేస్తుండగా రాహుల్ కూడా సెల్యూట్ చేయడం, ఆ తర్వాత ఆ వ్యక్తిని రాహుల్ ఆలింగనం చేసుకోవడానికి సంబంధించిన ఫోటోలు మంగళవారం సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. ఆ వ్యక్తి పేరు జతేందర్ సింగ్ అని యూనిఫారమ్ మీద ఉన్న ట్యాగ్ ద్వారా తెలుస్తోంది. దీనిపై కొందరు రిటైర్డ్ సైనికాధికారులు స్పందిస్తూ మాజీ సైనికోద్యోగులు ఎవరూ రాజకీయ సంబంధిత కార్యక్రమంలో యూనిఫారమ్ ధరించి పాల్గొనకూడదని వారు పేర్కొన్నారు. ఆ వ్యక్తి భుజం మీద ఉన్న కమాండో బ్యాడ్జి చాలా ఏళ్ల క్రితమే సైన్యం నుంచి కనుమరుగైందని, ఇప్పుడు స్పెషల్ ఫోర్సస్ అనే షోల్డర్ ఫ్లాష్ ఉంటుందని వారు తెలిపారు. కాగా..ఈ విమర్శలకు నాగాల్యాండ్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు, మాజీ సైనికాధికారి జికె ఝిమోని స్పందిస్తూ రాహుల్ గాంధీని కలిసినపుడు ఒక మాజీ సైనికోద్యోగి యూనిఫారమ్ ధరించడం తప్పయితే ప్రధాని నరేంద్ర మోడీ చేసింది కూడా తప్పేనని అన్నారు. బూటకపు జాతీయవాదం సాగుతున్న ఈ కాలంలో డ్రెస్ నిబంధనల గురించి ఎవరు లెక్క చేస్తున్నారు అని ఆయన ప్రశ్నించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)