హైదరాబాద్ పోలీసులకు ధన్యవాదాలు !

Telugu Lo Computer
0


శేఖర్‌ కమ్ముల నిర్మాణ సారథ్యంలో వచ్చిన ఆవకాయ్‌ బిర్యానీ తో హీరోగా వెండితెరకు కమల్‌ కామరాజు పరిచయమయ్యాడు. అనుకోకుండా ఒకరోజు, ఛత్రపతి, గోదావరి, జల్సా, అరవింద్‌2, కాటమరాయుడు, అర్జున్‌ రెడ్డి, మహర్షి, వకీల్ సాబ్‌ తదితర ల్లోనూ కీలక పాత్రలు పోషించి టాలీవుడ్ ప్రేక్షకులకు బాగా చేరువైపోయాడు. ట్యాలెంటెడ్‌ యాక్టర్‌. ఎలాంటి వివాదాల్లోనూ తలదూర్చడు. సోషల్ మీడియాలోనూ చాలా తక్కువగా కనిపిస్తుంటారు. అప్పుడప్పుడు తనకు సంబంధించిన అప్‌డేట్స్‌ మాత్రమే ఇస్తుంటారు. అలాంటి కమల్‌ కామరాజు తాజాగా సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన ఓ పోస్ట్‌ నెట్టింట తీవ్ర చర్చనీయాంశమైంది. పోలీసులకు దొరికపోయానంటూ వార్తల్లో నిలిచాడు. దీంతో నెటిజన్లు అతను పోలీసులకు దొరకడం ఏంటీ? ఏం నేరం చేశాడు? అని కొద్దిసేపు ఆశ్చర్యానికి గురయ్యారు. అసలు విషయం ఏంటంటే.. బైక్‌పై ఓవర్‌ స్పీడ్‌తో వెళుతూ హైదరాబాద్ ట్రాఫిక్‌ పోలీసులకు దొరికిపోయారు. అదే విషయాన్ని సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేసుకున్నారు. 'అందరికీ చెప్తాను. ఇవాళ నా బైక్ స్పీడు పెంచి దొరికిపోయాను. పొద్దున్నే ఖాళీ రోడ్ చూసి ఆత్రుత ఆపుకోలేక 60లో వెళ్లాల్సిన వాడిని 80లో వెళ్లాను. ఇంత పొద్దున్న సమయంలో కూడా నేను స్పీడుగా వెళ్లడాన్ని పట్టుకుని నాకు చలానా పంపిన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల పని తీరు, అడ్వాన్స్‌ టెక్నాలజీ చూసి నాకు చాలా సర్‌ప్రైజింగ్‌గా అనిపించింది. ట్రాఫిక్‌ నిబంధనలను అతిక్రమించి ఓవర్‌ స్పీడ్‌గా వెళ్లినందుకు క్షమాపణలు కోరుతున్నాను. అదే సమయంలో మా భద్రత కోసం అలుపెరగకుండా కృషి చేస్తున్న హైదరాబాద్‌ పోలీసులకు ధన్యవాదాలు ' అంటూ పోస్ట్ చేసిన కమల్ తాను బైక్ మీద వేగంగా వెళ్తున్న ఫొటోను కూడా షేర్‌ చేశాడు.

Post a Comment

0Comments

Post a Comment (0)