చైనా 80 శాతం మందికి కరోనా !

Telugu Lo Computer
0


కరోనా విజృంభిస్తోన్న వేళ చైనాను నూతన సంవత్సర వేడుకలు మరింత కలవర పెడుతున్నాయి. సెలవుల కారణంగా దేశవ్యాప్తంగా కోట్లాది మంది చైనీయులు సొంత గ్రామాలకు వెళ్లడం దీనికి కారణం. ఇదే విషయంపై అధ్యక్షుడు జిన్‌పింగ్‌ కూడా ఇటీవల ఆందోళన వ్యక్తం చేసినట్లు స్థానిక మీడియా తెలిపింది. అయితే, దేశ జనాభాలో ఇప్పటికే 80 శాతం మందికి వైరస్‌ సోకినట్లు చైనా ప్రభుత్వ ప్రధాన అంటువ్యాధుల నిపుణుడు తాజాగా వెల్లడించారు. ఈ నేపథ్యంలో.. రాబోయే రెండు మూడు నెలల్లో దేశంలో మహమ్మారి పుంజుకునే అవకాశాలు చాలా తక్కువని చెప్పారు. 'కొత్త సంవత్సరం సెలవుల నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రజల రాకపోకలతో చైనాలో వైరస్‌ విస్తరించే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో కేసులు పెరుగుతాయి. అయితే, సమీప కాలంలో రెండో వేవ్ వచ్చే అవకాశం లేదు! ఎందుకంటే దేశ జనాభాలో ఇప్పటికే 80 శాతం ప్రజలకు కరోనా సోకింది' అని చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్‌లోని చీఫ్ ఎపిడెమియాలజిస్ట్ వూ జున్‌యూ వెల్లడించారు. ఆస్పత్రుల్లో చేరికల విషయంలో ఇప్పటికే కరోనా గరిష్ఠ స్థాయిని దాటినట్లు చైనా ఇటీవలే ప్రకటించింది. మరోవైపు.. వైరస్‌ కారణంగా చైనాలో నిత్యం వందల సంఖ్యలో మరణాలు చోటుచేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. జీరో కొవిడ్‌ ఎత్తేసిన నెల రోజుల్లోనే 60 వేల కొవిడ్‌ మరణాలు నమోదైనట్లు చైనా అధికారికంగా వెల్లడించింది. ఇక కొత్త సంవత్సరం సెలవుల సమయంలో రోజూ 30 వేలకుపైగా మరణాలు సంభవించే ప్రమాదం ఉందని అంతర్జాతీయ నివేదికలు అంచనా వేస్తుండటం అక్కడి అధికారులను కలవరపాటుకు గురిచేస్తున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)