భారత్ జోడో కాదు, టోడో యాత్ర !

Telugu Lo Computer
0


కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మన సాయుధ బలగాల నైతక స్థైర్యాన్ని దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారని, ఆయన చేపట్టిన యాత్ర, భారత్ జోడో కాదని, భారత్ టోడో అని అన్నారు. శనివారం రాత్రి జరిగిన 'ఆప్ కీ అదాలత్' కార్యక్రమంలో నడ్డా మాట్లాడుతూ, రాహుల్ గాంధీ కంటే మన సాయుధ బలగాల నైతికతను బలహీనపరచే ప్రయత్నం చేసినవారెవ్వరూ లేరని అన్నారు. సర్జికల్ దాడులు, బాలాకోట్‌లో ఐఏఎఫ్ ఆపరేషన్‌ను రాహుల్ ప్రశ్నించారని, ఇటీవల మన బలగాలను కొట్టారంటూ వ్యాఖ్యానించారని అన్నారు. ''ఈ పదాలను వాడిన వారెవరు? బలగాల నైతిక స్థైర్యాన్ని దిగజార్చిందెవరు? రాహుల్ గాంధీకి మన బలగాల పట్ల సదుద్దేశం లేదు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో మన సరిహద్దులు సురక్షితంగా ఉన్నాయి. మన సరిహద్దులను పూర్తి శక్తియుక్తులతో సైనికులు కాపాడుతున్నారు'' అని నడ్డా అన్నారు. భారత్ జోడో యాత్రపై నడ్డా మాట్లాడుతూ.. ''ముందు ఆయనను సజావుగా యాత్రను ముగియనీయండి. ఇప్పటికైనా ఆయన మొదటిసారి ఇల్లు విడిచి బయటకు వచ్చారు. రియల్ ఇండియా ఏమిటో చూసే అవకాశం ఆయనకు కలిగింది'' అని అన్నారు. విద్వేష వ్యాప్తిని తొలగించేందుకు, ప్రేమభావాలను విస్తరింపజేసేందుకు యాత్రను చేపట్టినట్టు రాహుల్ చెబుతున్నారు కదా అని అడిగినప్పుడు, ఏ నేత అయినా గతంలో ఏమి మాట్లాడారో ఒకసారి విశ్లేషణ చేసుకోవాలని అన్నారు. ''ఆయన (రాహుల్) జేఎన్‌యూకు వెళ్లినప్పుడు అక్కడి వారు పార్లమెంటుపై దాడి చేసిన అఫ్జల్ గురుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అఫ్జల్ గురును చంపిందెవరు? సుప్రీంకోర్టు జడ్జిలా? అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీనా? రాహుల్ అక్కడకు వెళ్లి వారితో కలిసికట్టుగా పోరాటం చేస్తానని చెప్పారు. జేఎన్‌యూ నుంచి వచ్చిన వాళ్లలో ఒకరు ఇప్పుడు కాంగ్రెస్‌లో ఉన్నారు. రాహుల్‌గాంధీతో కలిసి నడిచారు. వీళ్లు భారత్‌ను ఐక్యం చేసేవాళ్లా? విభజించాలని చూసేవాళ్లా? ఇదెంతమాత్రం భారత్ జోడో యాత్ర కాదు, ఇది భారత్ టోడో యాత్ర'' అని నడ్డా ఘాటుగా సమాధానమిచ్చారు.

Post a Comment

0Comments

Post a Comment (0)