భార్యను హత్య చేసి, లేచిపోయిందని నాటకం ఆడాడు ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday, 13 January 2023

భార్యను హత్య చేసి, లేచిపోయిందని నాటకం ఆడాడు !


కేరళ లోని ఎర్నాకులంకు చెందిన సజీవ్ భార్య రమ్య  2021 ఆగస్టు నుంచి కనిపించకుండా పోయింది. 2022 ఫిబ్రవరిలో ఎన్ జరక్కల్ పోలీసులకు మిస్సింగ్ కంప్లైట్ ఇచ్చాడు. అయితే స్పెషల్ పోలీస్ టీం శాస్త్రీయ విచారణ జరిపి సజీవ్ ను నిందితుడని కనుక్కున్నారు. భార్యను చంపి ఇంటి ఆవరణలో పాతేసినట్లు పోలీస్ విచారణలో తేలింది. అయితే హత్య చేసిన తర్వాత తనకు ఏం తెలియనట్లు నటిస్తూ వచ్చాడు. అతడి కదలికను పరిశీలించేందుకు పోలీసులు అతనిపై నిఘా పెట్టారు. ఏడాది పాటు నిఘా ఉంచి విచారణ జరిపిన తర్వాత సాక్ష్యాలు సేకరించి అరెస్ట్ చేశారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఫోన్ కాల్స్ విషయంలో గొడవ ఈ హత్యకు కారణం అయిందని పోలీసులు తెలిపారు. ఇంటి ఆవరణలో పాతిపెట్టిన తర్వాత ఏడాదిన్నర పాటు నిందితుడు అదే ఇంట్లోనే ఉన్నాడు. తన భార్య వేరేవారితో లేచిపోయిందని బంధువులను, స్థానికులను నమ్మించాడు. చివరకు రెండో పెళ్లికి కూడా సిద్ధం అయ్యాడు. పోలీసులు జరిపిన విచారణలో ఇంటికి సమీపంలో భార్య రమ్య శవం అవశేషాలను కనుక్కున్నారు. హత్య, సాక్ష్యాలను నాశనం చేసినందుకు సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. 

No comments:

Post a Comment