అరుదైన అతిథి సమక్షంలో వివాహ వేడుక ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday, 20 January 2023

అరుదైన అతిథి సమక్షంలో వివాహ వేడుక !


మధ్యప్రదేశ్ గ్యాలియర్ లోని డీఆర్పీ లైన్ నివాసం ఉంటున్న రంజన శర్మ అనే యువతికి, ఆగ్రాకు చెందిన యతేంద్ర శర్మతో పెళ్లి నిశ్చయమైంది. అయితే రంజనకు మూగ జీవాలంటే చాలా ఇష్టం. ముఖ్యంగా గోవులు అంటే ఆమెకు చిన్నతనం నుంచి ఇష్టం. అంతేకాక నేటి కాలంలో గోవుల పట్ల పెరుగుతున్న నిర్లక్ష్య ధోరణి ఆమెను బాగా కలచివేసింది. ఈ క్రమంలో సనాతన ఆచారాలను ప్రజలకు గుర్తు చేయాలనే ఉద్దేశంతో తనపెళ్లి గోమాత సమక్షంలో జరుపుకోవాలని భావించింది. ఇదే విషయాన్ని తన తల్లిదండ్రులకు రంజన తెలిపింది. మొదట ఒప్పుకునేందుకు కాస్తా సంకోచించిన రంజన తల్లిదండ్రులు చివరకు అంగీకరించారు. తమ కుమార్తె చెప్పిన విషయాన్ని వరుడి కుటుంబ సభ్యులకు వివరించారు. వారు కూడా గోమాత సమక్షంలో వివాహం జరిపించేందుకు సంతోషంగా అంగీకరించారు. ఈ క్రమంలో పెళ్లి రోజున మొదట సాధువుల సమక్షంలో వధూవరులు ఓ గోవుకు ప్రత్యేక పూజాలు నిర్వహించారు. ఆ తరువాత దాని సమక్షంలోనే వేదమంత్రాల సాక్షిగా ఆ యువజంట వివాహం జరిగింది. గోవుల ప్రాముఖ్యతను తెలుపుతూ ఈ నూతన జంట చేసిన పనికి అందరూ అభినందించారు. అంతేకాక ఈ వార్త సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.

No comments:

Post a Comment