బీబీసీ డ్యాక్యుమెంటరీపై ఫిబ్రవరి 6న విచారణ !

Telugu Lo Computer
0


ప్రధాని మోడీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని బ్యాన్ చేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు పరిశీలించింది. అనంతరం ఈ కేసుపై విచారించేందుకు అంగీకరించిన సుప్రీం కోర్టు ఫిబ్రవరి 6న విచారణ చేపట్టనున్నట్లు ప్రకటించింది. సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్‌, జస్టిస్ పీఎస్ నర్సింహా, జేబీ పర్దివాలాతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ జరిపింది. 2002లో గుజరాత్‌లో జరిగిన అల్లర్లలో మోడీ హస్తం ఉన్నట్లు బీబీసీ తన డాక్యుమెంటరీలో చూపించింది. దీంతో ఆ డాక్యుమెంటరీ వివాదాస్పదమైంది. సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కేంద్రం ఇటీవలే దాన్ని నిషేధించింది. అయితే ఈ నిర్ణయం రాజ్యాంగ వ్యతిరేకమని, ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని ఎంఎల్ శర్మ అనే న్యాయవాది కోర్టును ఆశ్రయించారు.ఆయనతో పాటు మాజీ జర్నలిస్టు ఎన్ రామ్‌, సామాజిక కార్యకర్త ప్రశాంత్ భూషణ్‌, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రాలు కూడా పిటిషన్లు దాఖలు చేశారు. వాటన్నింటిపై ఫిబ్రవరి 6న విచారణ జరుపుతామని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)