రోజుకు 26.59 లీటర్ల పాలిస్తున్న గేదె !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఓ వ్యక్తి పాల వ్యాపారం మొదలు పెట్టి రూ. వేలు సంపాదిస్తున్నాడు. మండపేట రైతుకు చెందిన ఓ గేదె రోజుకు 26.59 లీటర్ల పాలిస్తుంది. మండపేట పట్టణానికి చెందిన పాడి రైతు ముత్యాల సత్యనారాయణ, అబ్బు మేలు జాతి పశుపోషణ చేస్తున్నారు. ముత్యాల సత్యనారాయణ కొన్నేళ్ల కింద ముర్రా జాతి పాడి గేదెను కొన్నారు. అప్పటి నుంచి గేదె రోజుకు 26.59 లీటర్లు పాలు ఇస్తున్నట్లు సత్యనారాయణ తెలిపారు. ఆ గేదె వయసు నాలుగేళ్లు మాత్రమేనని, పాలు దిగుబడిలో తల్లిని మించిపోయిందని తెలిపారు. రోజుకు 26.59 లీటర్ల పాలు ఇస్తూ రికార్డు సృష్టించిందని సంతోషం వ్యక్తం చేశారు. ఎనిమిదేళ్ల కిందట తెలంగాణ నిజామాబాద్ జిల్లాలో ముర్రా జాతి పాడి గేదెను కొనుగోలు చేశానని రైతు వివరించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)