గండికోటలో భారతీయుడు-2 షూటింగ్

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని  పర్యాటక కేంద్రమైన గండికోటలో భారతీయుడు-2 సినిమా చిత్రీకరణలో భాగంలో ఆదివారం కథానాయకుడు కమల్‌హాసన్‌ పాల్గొన్నారు. దర్శకుడు శంకర్‌ ఈ చిత్రం చివరి దశ షూటింగ్‌కు సంబంధించి గండికోట ముఖద్వారం వద్ద ఏర్పాటుచేసిన సెట్టింగ్‌లో కమల్‌హాసన్‌పై పలు సన్నివేశాలను చిత్రీకరించారు. తమ అభిమాన నటుడు కమల్‌హాసన్‌ గండికోటకు రావడంతో చుట్టు పక్కల ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. షూటింగ్‌ నుంచి కమలహాసన్‌ బయటికి వచ్చి అభిమానులకు నమస్కరించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)