రేపు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం

Telugu Lo Computer
0


పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రేపు ప్రారంభమవుతాయి. ఈ సమావేశాలు 31న మొదలై ఫిబ్రవరి 13 వరకూ ఉంటాయి. తిరిగి మార్చి 13 నుంచి ఏప్రిల్ 6 వరకూ ఉంటాయి. తొలిరోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండు సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈరోజు ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం జరుగుతుంది. ఇందులో ఈసారి బడ్జెట్ వివరాల్ని తెలుపుతారు. సమావేశాలకు సహకరించాల్సిందిగా కేంద్రం.. ప్రతిపక్షాలను కోరుతుంది. రేపు రాష్ట్రపతి ప్రసంగం తర్వాత ఆర్థిక సర్వేను ప్రవేశ పెడతారు. అందులో దేశం పరిస్థితి ఎలా ఉంది? విదేశీ మారక నిల్వల సంగతేంటి? ఆర్థికంగా ఎలా ఉన్నాం వంటి అంశాలను పొందుపరుస్తారు. ఫిబ్రవరి 1న బుధవారం నాడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2023-2024 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ముందుగా లోక్‌సభలో ప్రవేశపెడతారు. తర్వాత రాజ్యసభలో ప్రవేశపెడతారు. 2024 ఏప్రిల్‌లో లోక్‌సభ ఎన్నికలు జరుగనున్నాయి. అందువల్ల వచ్చే సంవత్సరం పూర్తి స్థాయి బడ్జెట్‌ని ప్రవేశపెట్టడం కుదరదు. కాబట్టి ఈ ప్రభుత్వానికి ఇదే చివరి పూర్తి స్థాయి బడ్జెట్. ఈ బడ్జెట్.. ప్రజలకు నచ్చేలా ఉంటుంది అని కొందరు రాజకీయ నిపుణులు అంచనా వేస్తుంటే... అలా ఏమీ ఉండదు.. సాధారణంగానే ఉంటుందని మరికొందరు అంటున్నారు. ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని ఆకర్షణీయ పథకాలేవీ ఉండవని కేంద్రం ఆల్రెడీ చెప్పింది కాబట్టి... ఈసారి బడ్జెట్ కూడా వాస్తవాలకు దగ్గరగానే ఉంటుందని అంటున్నారు. దీనిపై ప్రజలు ఎక్కువ ఆశలు పెట్టుకోకపోవడం మేలని సూచిస్తున్నారు. అయితే ఈసారి రైల్వేలు, రక్షణ రంగానికి మాత్రం భారీ కేటాయింపులు ఉంటాయి అని తెలుస్తోంది.


Post a Comment

0Comments

Post a Comment (0)