'వారసుడు' తెలుగు వెర్షన్ 14కి వాయిదా

Telugu Lo Computer
0

తమిళ హీరో విజయ్ నటించిన వారసుడు సినిమా తెలుగు వెర్షన్ రిలీజ్‌పై సందిగ్ధత వీడిపోయింది. గతంలో సంక్రాంతి కానుకగా ఈనెల 11న ఈ మూవీ విడుదలవుతుందని చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే ఇప్పటివరకు బుకింగ్ యాప్స్‌లో ఈ సినిమా కనిపించకపోవడంతో అభిమానులు గందరగోళానికి గురయ్యారు. ఇంకా రెండు రోజుల సమయమే ఉన్నా టిక్కెట్లు అందుబాటులో లేకపోవడంతో ఈ సినిమా విడుదలపై నీలినీడలు కమ్ముకున్నాయి. తాజాగా వారసుడు తెలుగు వెర్షన్‌ రిలీజ్ వాయిదా వేస్తునట్లు నిర్మాత దిల్ రాజు అధికారికంగా ప్రకటించారు. తమిళంలో మాత్రం ఈనెల 11నే వారసుడు విడుదలవుతుండగా, తెలుగులో మాత్రం ఈనెల 14న విడుదల చేస్తున్నట్లు వివరించారు. టాలీవుడ్ ఇండస్ట్రీలోని పెద్దలతో డిస్కస్ చేసిన తర్వాతే సినిమాను రెండు రోజులు ఆలస్యంగా విడుదల చేయాలనే నిర్ణయాన్ని తీసుకున్నట్లు వెల్లడించాడు.

Post a Comment

0Comments

Post a Comment (0)