గో ఫస్ట్‌ ఎయిర్‌వేస్‌కు రూ.10 లక్షలు జరిమానా

Telugu Lo Computer
0


గో ఫస్ట్‌ ఎయిర్‌వేస్‌కు చెందిన G8 116 విమానం బెంగళూరు విమానాశ్రయంలో 55 మంది ప్రయాణికులను వదిలేసి టేకాఫ్‌ అయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి గో ఫస్ట్‌ ఎయిర్‌వేస్‌కు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ రూ.10 లక్షలు జరిమానా విధించింది.  తాజా ఘటన టెర్మినల్‌ కోఆర్డినేటర్‌, కమర్షియల్‌ సిబ్బంది, బోర్డింగ్‌ సిబ్బందికి మధ్య సమాచార లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. ప్రయాణికులకు తగిన ఏర్పాట్లు చేయడంలో ఎయిర్‌లైన్స్‌ విఫలమైందని డీజీసీఏ పేర్కొంది. మరోవైపు ఈ ఘటనకు పూర్తి బాధ్యత వహిస్తున్నట్లు గో ఫస్ట్‌ ఎయిర్‌వేస్‌ ప్రకటించింది. పర్యవేక్షణ లోపం కారణంగానే ప్రయాణికులను విడిచి వెళ్లిపోయినట్లు తమ వివరణలో పేర్కొంది. విమానాశ్రయంలో మిగిలిపోయిన 55 మంది ప్రయాణికులు ఏడాదిలోపు దేశంలో ఎక్కడికైనా ఒకసారి ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పిస్తున్నట్లు గో ఫస్ట్‌ ఎయిర్‌వేస్‌ తెలిపింది. ఢిల్లీ వెళ్లాల్సిన తమను బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో వదిలేసి గోఫస్ట్‌ ఎయిర్‌వేస్‌ విమానం టేకాఫ్‌ అయిందని 55 మంది ప్రయాణికులు సామాజిక మాధ్యమాల్లో తమ అసహనాన్ని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ విషయం వైరల్‌గా మారడంతో డీజీసీఏ తీవ్రంగా పరిగణించి చర్యలకు ఉపక్రమించింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)